ఈ ప్యాంటుని చూసి గోనె సంచి అనుకోవద్దు... ధర రూ. 65,000 మరి?

ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది.మన యువత ముఖ్యంగా వెస్ట్రెన్ వేర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ వుంటారు.

 Palazzo Made Of Jute Viral Social Media,jute Palazzo,bori Wala Palazzo,viral,soc-TeluguStop.com

ఈ క్రమంలోనే రకరకాల బ్రాండ్స్ రకరకాల దుస్తుల్ని మార్కెట్లోకి దించుతూ వుంటారు. ‘కొత్తొక వింత, పాతొక రోత’ అని నానుడి.

దానికి తగ్గట్టే మనవాళ్ళు బెహేవ్ చేస్తూ వుంటారు.బయటవాళ్ళకి అసహ్యంగా ఉన్నప్పటికీ మనవాళ్ళు మాత్రం దానికి ఫాషన్ అని పేరు పెడుతూ వుంటారు.

కట్ చేస్తే దానినే ఈ బ్రాండ్స్ అని పేలవబడేవారు క్యాష్ చేసుకుంటూ వుంటారు.అక్కడినుండి వచ్చినవే చినిగిన ఫాంట్స్.

Telugu Jute Palazzo, Sixtythousand-Latest News - Telugu

స్టైల్ గా వాటిని టోన్ జీన్స్ అని మనవాళ్ళు చెప్పుకున్నా చూసేవారికి మాత్రం అవి చాలా ఎబ్బెట్టుగా కనబడతాయనే విషయం మీకు తెలిసినదే.ఎందుకంటే మీరు కూడా అలాంటి దుస్తులు వేసుకున్న వారిని చూసినపుడు లోలోపల తిట్టుకుంటారు కదూ.అన్నట్టు ప్రస్తుతం అలాంటి విచిత్రమైన బట్టలకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.ఈ క్రమంలోనే ఓ విచిత్రమైన పలాజో ప్యాంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది దేనితో తయారు చేసారో తెలిస్తే అవాక్కవుతారు.అదే గోనెసంచితో తయారు చేసిన ప్యాంట్.

Telugu Jute Palazzo, Sixtythousand-Latest News - Telugu

గోనెసంచితో చేసిన ప్యాంట్ కి అంత డిమాండ్ వుంటుందా? అని ఆశ్చర్యపోవద్దు.సాధారణంగా వడ్లు, బియ్యం, చిరు ధాన్యాలు నింపుకునేందుకు వీటిని ఉపయోగిస్తూంటారు.ఇప్పుడు వాటితో బట్టలు కూడా తయారు చేసేస్తున్నారు.హోలీ ఫ్యాషన్ అనే కంపెనీ ఈ గోనె సంచి పలాజో ప్యాంట్ తయారు చేసి, ఏకంగా రూ,65,000 రూపాయలకు మార్కెట్లో అమ్మకానికి ఉంచింది.

అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారనుకోకండి.చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారు మరి.ఇక్కడ ఫోటోని చూసి మీకు ఇష్టమో కాదో తేల్చుకోండి మరి.తీరా కొన్నాక బాలేదంటే బాగోదు మరి.బ్రాండ్ వాళ్ళు ఫీల్ అవుతారు మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube