డ్రైవర్ లేకుండానే దానంతట అదే తిరిగిన కారు.. అవాక్కయ్యే వీడియో!

డ్రైవర్ లేకుండా ఆటోమేటిక్‌గా నడిచే కార్లు( Automatic Cars ) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.వాటంతట అవే కార్లు డ్రైవింగ్ చేస్తాయి.

 Out Of Control Car Circling Around Another Vehicle Video Viral Details, Driver,-TeluguStop.com

మనలను గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చుతాయి.దారిలో ఏవైనా అడ్డంకులు వచ్చినా స్వయంచాలకంగా వాటంతట అవి ఆగిపోతాయి.

టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది.అయితే ఇదే టెక్నాలజీ ఒక్కోసారి మనకు చిక్కులు తీసుకొస్తుంది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ను( Artificial Intelligence ) వెబ్‌సైట్లలోనే కాకుండా కార్లలోనూ వినియోగిస్తున్నారు.ముఖ్యంగా టెస్లా కంపెనీ కార్లలో దీనిని ఎప్పుడో మొదలు పెట్టారు.

క్రమంగా ఈ ఏఐ టెక్నాలజీని అన్ని దేశాల్లోని కార్లలో వినియోగించేందుకు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి.

ఇక టెక్నాలజీలో ముందుండే చైనాలో( China ) తాజాగా ఆసక్తికర ఘటన జరిగింది.

మనిషి లేకుండానే ఓ కారు రోడ్డుపై చక్కర్లు కొట్టింది.బొంగరంలా గిరగిరా తిరుగుకుంటూ వెళ్లి అందరినీ భయపెట్టింది.

చివరికి ఓ కారును గుద్దుకుని ఆగిపోయింది.దీని గురించి విషయాలు తెలుసుకుందాం.

రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లు, బైకులు వాటంతటా అవే ముందుకు కదిలిన వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం.

Telugu Car, Cartechnical, China, Latest, Nantong, Nantong Car, Control Car-Lates

హఠాత్తుగా అవి ముందుకు దూసుకెళ్లి పల్టీలు కొడతాయి.దీనిని కొందరు దెయ్యాలు ఇలా చేశాయని భావిస్తారు.అయితే సైన్స్‌పై అవగాహన ఉన్న వారు మాత్రం టెక్నికల్ లోపం వల్ల ఇలా జరిగిందని బదులిస్తారు.

ఇలాంటి ఓ ఘటన తాజాగా చైనాలో జరిగింది.చైనాలోని నాన్‌టాంగ్‌( Nantong ) ప్రాంతంలో ఓ తెల్లటి కారు( White Car ) అందరినీ టెన్షన్‌కు గురి చేసింది.

రోడ్డుపై రింగురింగులుగా తిరుగుతూ చివరికి ఓ నల్లటి కారును ఢీకొంది.అప్పటి వరకు రోడ్డుపై రౌండ్లు కొట్టింది.

దీంతో అది ఎవరిని ఢీకొంటుందోననే భయంతో అందరూ ఆందోళన చెందారు.

Telugu Car, Cartechnical, China, Latest, Nantong, Nantong Car, Control Car-Lates

డ్రైవర్ లేకుండా ఇలా రోడ్డుపై అది చక్కర్లు కొడుతుండడంతో చాలా మంది ఆందోళన చెందారు.చివరికి మరో కారును ఢీకొట్టి ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.టెక్నికల్ లోపం వల్ల ఇలా జరగడమేంటని, ఇక భవిష్యత్తులో ఏఐ వల్ల ఇలా ఎక్కువ కార్లకు జరిగితే పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు.

కార్ల తయారీ చేసే సమయంలోనే ఇలాంటి తప్పిదాలు జరగకుండా టెక్నికల్ లోపాలు సరిదిద్దాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube