మామూలుగా మన పెద్దలు ఉల్లిపాయలను యవ్వనంలో ఉన్నటువంటి యువకులు తింటే శృంగార సామర్థ్యం పెంపొందించే ప్రక్రియలో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు.అయితే తాజాగా కొందరు వైద్య నిపుణులు ఈ విషయం గురించి పరిశోధనలు చేసి పలు ఆసక్తి కర విషయాలను తెలిపారు.
ముఖ్యంగా ఉల్లిగడ్డలను తరచూ తీసుకోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి విషయంలో చాలా మేలు కలుగుతుందని కనుగొన్నారు.అంతేగాక ఈ ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి రసాన్ని తయారు చేసుకొని పొద్దున్నే సమయంలో రోజు టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి బాగా జరుగుతుందని తెలిపారు.
రోజూ పచ్చి ఉల్లిగడ్డను తినడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని కూడా వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ల సమస్య ఉన్నటువంటి వారు తరచూ ఉల్లిగడ్డలను పెరుగన్నంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.
కాగా పలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఉల్లి మంచి ఔషధంగా పనిచేస్తుందని, అంతేగాక పలు డయాబెటిస్ మరియు షుగర్, బీపీ వంటి వ్యాధులకు కూడా ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి.అందుకే అంటారు పెద్దలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని.