ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ (పీబీఎస్ఏ) కోసం 27 మంది ఎన్ఆర్ఐలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్‌లను ప్రదానం చేస్తారు.
భారత సంతతి (పీఐవోలు), ఎన్ఆర్ఐలు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డ్‌లను బహూకరిస్తారు.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 17వ ఎడిషన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 8 నుంచి 10 వరకు జరగనుంది.
ఈ అవార్డులకు ఎంపికైన 27 మందిలో అమెరికాలో స్థిరపడిన పంజాబీ వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధాలివాల్ (72) కూడా ఒకరు.రెండేళ్ల క్రితం భారత్‌లోకి అడుగుపెట్టడానికి అనుమతి నిరాకరించబడిన వ్యక్తికి ఇప్పుడు కోరి ప్రవాసీ భారతీయ సమ్మాన్ వరించడం ఆశ్చర్యకరం.
అమెరికాకు వలస వెళ్లిన తొలి తరం వ్యక్తుల్లో దర్శన్ సింగ్ కూడా ఒకరు.పాటియాలా జిల్లా రఖ్రా గ్రామానికి చెందిన ఆయన 1972లో 21 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ చదవడానికి అమెరికా వెళ్లారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత.ఆయన 1977లో పెట్రోలియం రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించారు.
ఓ గ్యాస్ స్టేషన్‌ను 3,700 డాలర్లకి కొనుగోలు చేశారు.ఇప్పుడు ఆయన కంపెనీ ‘‘బల్క్ పెట్రోలియం’’కు అమెరికా అంతటా 1,000 గ్యాస్ స్టేషన్‌లను కలిగి వుంది.
విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో స్థిరపడిన దర్శన్ సింగ్‌కు సిక్కు కమ్యూనిటీలో మంచి గుర్తింపు వుంది.వ్యాపారంతో పాటు భారత్, అమెరికాలలో దర్శన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.2004లో తమిళనాడును వణికించిన సునామీ సమయంలో ఆయన సహాయక చర్యల కోసం విరాళాలు అందజేశారు.అంతేకాకుండా 1000 మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్ ఇచ్చి అండగా నిలబడ్డారు.
అమెరికాలో స్టార్టప్ ప్రారంభించేందుకు గాను 2000 మంది భారతీయులకు దర్శన్ సహాయం చేశారు.విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను నిర్మించేందుకు 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.7,491 కోట్ల)ను విరాళంగా ఇచ్చారు.ఆయన సోదరుడు సుర్జిత్ సింగ్ రఖ్రా పంజాబ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లో కీలక నాయకుడు, గతంలో ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
అయితే.నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేసిన సమయంలో దర్శన్ అన్నదాతలకు మద్ధతుగా నిలిచారు.అంతేకాకుండా ఢిల్లీ శివార్లలోని సింఘూ బోర్డర్‌లో లంగర్ నిర్వహించి రైతులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో దర్శన్ సింగ్ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు 2021 అక్టోబర్ 23న చికాగో-ఢిల్లీ విమానంలో భారత్‌కు వచ్చారు.అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్శన్ సింగ్‌ను అడ్డుకుని అనుమతి నిరాకరించారు.
ఐదు గంటల హైడ్రామా తర్వాత ఆయనను అదే విమానంలో తిరిగి అమెరికాకు పంపించారు.