మియా మాల్కోవా తర్వాత ఎన్టీఆర్‌ అంటున్న డైరెక్టర్‌

నేడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కావడంతో ఒక ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది.ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ డబు రత్నానీ తీసిన ఫొటోలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో పాటు అద్బుతమైన కండలతో ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తున్నాడు.

 Ram Gopal Varma, Ntr,jr.ntr Sixpacks,mia Malkova, Rgv Comments On Ntr Six Pack-TeluguStop.com

నీ కండలకు నీరాజనాలు అంటున్నారు.ఎన్టీఆర్‌ను గతంలో ఎప్పుడు ఇలా చూడలేదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే సమయంలో ఎన్టీఆర్‌ ఫొటోపై రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.ఇక్కడ కూడా మియా మాల్కోవాను వదిలి పెట్టలేదు.

రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం క్లైమాక్స్‌ అనే ఒక సినిమాను మియా మాల్కోవాతో తెరకెక్కించాడు.ఆ సినిమా ప్రమోషన్‌ కోసం అన్నాడో లేదా మరేమో కాని ఈ ఫొటోను షేర్‌ చేసిన వర్మ… వావ్‌ మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్‌ బాడీ ఇదే అంటూ ట్వీట్‌ చేశాడు.

వర్మ ఏం చేసినా విభిన్నంగానే ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.

Telugu Jrntr, Mia Malkova, Ram Gopal Varma, Rgv Ntr Pack-

ఎన్టీఆర్‌ బాడీని మియా మాల్కోవా బాడీతో కంపైర్‌ చేయడంతో పాటు ఆమె తర్వాత ఎన్టీఆర్‌ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది.ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఫొటోతో పాటు వర్మ ట్వీట్‌ కూడా వైరల్‌ అయ్యింది.రామ్‌ గోపాల్‌ వర్మ క్లైమాక్స్‌ మూవీ ని ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

ట్రైలర్‌తో ఇప్పటికే క్లైమాక్స్‌పై అంచనాలు పెంచాడు.తాజాగా ఎన్టీఆర్‌ ఫొటోపై కామెంట్‌ చేసి మరోసారి తన సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేలా వర్మ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube