జనతా గ్యారేజ్ రివ్యూ

చిత్రం : జనతా గ్యారేజ్

 Janatha Garage Movie Review-TeluguStop.com

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్

దర్శకత్వం : కొరటాల శివ

నిర్మాతలు : నవీన్ యర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)

సంగీతం : దేవిశ్రీప్రసాద్

విడుదల తేది : సెప్టెంబరు 1, 2016

నటీనటులు : ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్య మీనన్ తదితరులు

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ చిత్రాలతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.ఇక మిర్చి, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో సరికొత్త బ్రాండ్ గా ఎదిగాడు కొరటాల శివ.వీరిద్దరికి తోడుగా మళయాళ దిగ్గజం మోహన్ లాల్ కూడా ఉండటంతో, దక్షిణాది మొత్తం జనతా గ్యారేజ్ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.మరి జనతా గ్యారేజ్ అంచనాలను అందుకుందా? ఎన్టీఆర్‌ అభిమానుల రికార్డుల దాహాన్ని తీరుస్తాడా లేదా చూద్దాం.

కథలోకి వెళ్తే …

ఆనంద్ (ఎన్టీఆర్) ముంబై యూనివర్సిటీలో ఒక ఎన్విరాన్మెంటల్ స్టూడెంట్.

అనంద్ కి ప్రకృతి అంటే విపరీతమైన ప్రేమ.భూమిని సంరక్షించాలనేది ఆనంద్ ఆశయం.

ఇక మరోవైపు సత్యం (మోహన్ లాల్) జనతా గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు.భూమి మీద మనుషులని సంరక్షించాలనేది సత్యం ఆశయం.

ఇద్దరు అనుకోని సందర్భంలో కలుస్తారు.జనతా గ్యారేజ్ లో ఆనంద్ ప్రయాణం మొదలవుతుంది.

అసలు జనతా గ్యారేజ్ చేసే పని ఏంటి ? అనంద్ ఎవరెవరికి రిపేర్లు చేసాడు అనేది మిగితా కథ.

నటీనటుల నటన గురించి

నటుడిగా ఎన్టీఆర్ ఎదుగుతున్న తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.చిన్న వయసులోనే ఆకాశాన్నంటే స్టార్ డమ్ సంపాదించి, అవే బరువైన పాత్రలు, హింసపూరితమైన సినిమాలతో ఒకానొక దశలో పూర్తిగా మూసలోకి వెళ్ళిపోయిన ఎన్టీఆర్, ఇప్పుడు తన స్టార్ ఇమేజ్ కన్నా కథ ముఖ్యం అంటున్నాడు.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ … మూడు భిన్నమైన సినిమాలు, మూడు విభిన్నమైన పాత్రలు.

ఆనంద్ కూడా బరువైన పాత్రే, కాని అది భావోద్వేగాల బరువు.ఆ బరువుని బాగా బ్యాలెన్స్ చేసాడు ఎన్టీఆర్.ఇంటర్వల్, గవర్నమెంటు ఆఫీస్ సీన్, సెంకండాఫ్ లో సమంతతో ఒక సీన్, ఇక్కడ ఎన్టీఆర్ నటన గురించి మేము చెప్పడం కాదు.మీరు చూసి ఆనందించాల్సిందే.

మోహన్ లాల్ పాత్రని కూడా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు.నటనపరంగా ఎలాంటి కామెంట్స్ లేకున్నా, మోహన్ లాల్ సినిమాలు ఇప్పటికే చూసినవాళ్ళకి డబ్బింగ్ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.

సమంత, నిత్య మీనన్ ఫర్వాలేనిపించారు.అంతకు మించి చెప్పుకోవడానికి లేదు.

సచిన్ ఖెడేకర్ ఒకే.ఉన్ని కృష్ణన్ మెప్పించాడు.రాజీవ్ కనకాల గుర్తుండిపోతాడు.సాయికుమార్, దేవయాని పాత్ర పరిధిమేరలో నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

తిరు సినిమాటోగ్రాఫి సినిమాకి ప్రధాన బలం.లైటింగ్ గాని, ఫ్రేమింగ్ కాని, ఎక్కడా పాయింట్ పర్సంట్ కూడా తగ్గదు.సినిమా చూసిన తరువాత జనాలు ఖచ్చితంగా కెమెరా వర్క్ గురించి మాట్లాడుకుంటారు.దేవిశ్రీప్రసాద్ పాటలు ఇప్పటికే మంచి రెస్పాస్స్ రాబట్టగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాయి.

నిర్మాణ విలువలు అత్యద్భుతం.ఎడిటింగ్ బాగుండాల్సింది.

కొరటాల శివ మూలకథ, డైలాగ్స్ చాలా బాగున్నాయి.కాని కథనమే, ఇటు పూర్తిగా బాగాలేదు అని చెప్పడానికి మనసు ఒప్పదు.

అలాగే చాలా బాగుంది అని చెబితే ప్రేక్షకమేధస్సు ఒప్పుకోదు.

విశ్లేషణ

సినిమా మొదలయిన కాసేపటికి దాకా ఎన్టీఆర్ కనబడట్లేదని కంగారు పడతారు.

మొహన్ లాల్ క్యారెక్టర్ ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు దర్శకుడు.కొరటాల ధైర్యాన్ని, ఎన్టీఆర్ ప్రయోగాన్ని మెచ్చుకోవాలి.

ఫస్టాఫ్ ఫర్వాలేదు అని సాగుతున్న మూడ్ ఒక్కసారిగా ప్రీ ఇంటర్వల్, ఇంటర్వల్ సన్నివేశాలతో పైకి లేస్తుంది.ఆ తరువాత వచ్చే రాజీవ్ కనకాల ఎపిసోడ్లు అంచనాలను విపరీతంగా పెంచేస్తాయి.

అక్కడనుంచి సినిమా సాగదీసినట్టుగా, గవర్నమెంటు ఆఫీసు సీన్ లాంటి హై ఎమోషన్ నుంచి కింద పడిపోయినట్లుగా అనిపిస్తుంది.అంచనాలు ఒక్కసారిగా పెంచేసి, మళ్ళీ సినిమా డల్ చేయడం దర్శకుడి తప్పే.

ఇక ఇటు సమంతతో, అటు నిత్యమీనన్ తో ఎన్టీఆర్ ట్రాక్ లాజిక్ కి అర్థం కాదు.

అయితే, మాస్ ప్రేక్షకులు కోరికే అంశాలు మాత్రం బాగానే ఉన్నాయి.

ఎమోషన్స్ ఉన్నాయి, అద్భుతంగా పండించిన నటులు ఉన్నారు కాని నరేషన్ మెల్లిగా ఉండటమే బాధాకరం.ఫస్టాఫ్ ని క్లాస్ ఆడియెన్స్, సెకండాఫ్ ని మాస్ ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి ఎన్ని రికార్డులు రిపేర్ అవుతాయో చెప్పొచ్చు.

హైలైట్స్ :

* ఎన్టీఆర్

* మోహన్ లాల్, మిగితా పాత్రల అభినయం

* డైలాగ్స్

* ఇంటర్వల్

* గవర్నమెంటు ఆఫీస్ సన్నివేశం

* కాజల్ ఐటమ్ సాంగ్

డ్రాబ్యాక్స్ :

* స్లో నరేషన్

* చివరి 20-25 నిమిషాలు

* ఎడిటింగ్

చివరగా :

ఎన్టీఆర్ మెరిసాడు .కొన్ని రిపేర్లు ఉన్నా, చూడదగ్గ సినిమా.

తెలుగుస్టాప్ రేటింగ్ : 3.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube