ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వర్షన్ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.స్టార్ మా లో గతంలో నాగార్జున మరియు చిరంజీవిలు చేసిన షో మాదిరిగానే ఇది ఉంటుంది.
స్టార్ మా లో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రసారం అయ్యింది.జెమినిలో మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పై ప్రోమోను చిత్రీకరించారు.ఆ ప్రోమో వారం పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
తాజాగా ఈ షో టైటిల్ లోగో బయటకు వచ్చింది.ఈ లోగో అఫిషియల్ గా రిలీజ్ అయ్యిందా లేదంటే ఎవరైనా లీక్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మీలో ఎవరు కోటీశ్వరుడు మొదట మంచి రేటింగ్ ను దక్కించుకున్నా కూడా చిరంజీవి రంగంలోకి దిగడంతో పెద్దగా రేటింగ్ రాలేదు.దాంతో స్టార్ మా వారు మీలో ఎవరు కోటీశ్వరుడు ను పక్కకు పెట్టారు.
ఇప్పుడు వారి దృష్టి అంతా కూడా బిగ్ బాస్ పై ఉంది.కనుక మీ లో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంను ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని వారు చేస్తామంటే ఒప్పుకుని ఇచ్చేశారు.
ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్ బాస్ తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించాడు.కనుక ఎవరు మీలో కోటీశ్వరులు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.
కౌన్ బనేగా కరోడ్ పతి టైటిల్ లోగో మాదిరిగానే ఎన్టీఆర్ చేయబోతున్న షో లోగో కూడా ఉందని అంటున్నారు.ప్రస్తుతం లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షో ప్రోమో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.షో ను మే నుండి షురూ చేసే అవకాశం ఉందని రెండు నెలల పాటు షో పై భారీ ప్రమోషన్స్ ను నిర్వహించాలని జెమిని వారు ప్రయత్నాలు చేస్తున్నారు.