Sardar Aha :‘ఆహా’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా న‌వంబ‌ర్ కార్తీ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సర్దార్’

సీక్రెట్ ఏజెంట్లు రోగ్‌గా మారిన‌ట్లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించ‌టం అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది, సీక్రెట్ ఏజెంట్స్‌ ఉద్దేశాలను, వారి నిజమైన వ్యక్తిత్వాలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వారిని ఆడియెన్స్ ప్ర‌శ్నిస్తుంటారు.అలాంటి సీట్ ఎడ్జ్ మూమెంట్ , ఎంగేజింగ్, ఎంట‌ర్‌టైనింగ్ స్పై థ్రిల్ల‌ర్ మూవీని ద‌ర్శ‌కుడు పి.

 November Karthi's Latest Blockbuster Movie 'sardar' As 'aha' World Digital Premi-TeluguStop.com

ఎస్‌.మిత్ర‌న్ తెర‌కెక్కించారు.

ఆ సినిమానే ‘సర్దార్’.నవంబర్ 18న ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

రాశీ ఖన్నా, రజీషా విజయన్, చుంకీ పాండే, లైలా కీలక పాత్రల్లో నటించారు.‘ఒకానొక సమయంలో ఓ ఘోస్ట్ ఉండేది.

కానీ అది ఇక అబద్దం కాదు’ అనే దాన్ని బేస్ చేసుకుని, అలాంటి కాన్సెప్ట్ చుట్టూ తిరగేలానే ‘సర్దార్’ సినిమాను తెరకెక్కించారు.విజయ్ ప్రకాష్ (కార్తి) పబ్లిసిటీ తెచ్చుకోవాలని పాకులాడే ఓ పోలీస్ ఆఫీసర్.

కనిపించకుండా పోయిన తన తండ్రి కారణంగా దేశ ద్రోహి కొడుకు అనే భారాన్ని మోస్తుంటాడు.తనని ఆ భయం వెంటాడుతుంటుంది.

సమీర (లైలా) అనే సామాజిక కార్యకర్త నీటి వనరులను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తుంటుంది.విజయ్ ప్రకాష్ దేశాన్ని ప్రమాదంలో పడేసే అబద్ధాలు, మోసానికి సంబంధించిన ఇబ్బందికరమైన వెబ్‌కి సంబంధించి వివరాలను సేకరించటం కోసం హంతకులను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు.

ప్రమాదకరమైన, దుష్టుడైన బిజినెస్ మేన్ రాథోడ్ (చుంకీ పాండే)ని, అతని నీచమైన ప్రణాళికలను ఆపగలిగే ఏకైక వ్యక్తి.విజయ్ కార్తీక్ తండ్రి సూపర్ స్పై అజ్ఞాతంలో ఉంటాడు.

అత‌ను ఏం చేశాడ‌నేదే సినిమా.

కార్తి ఇందులో డ్యూయెల్ రోల్‌ను పోషించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘ఒక డిఫరెంట్ మూవీ అయిన సర్దార్‌లో భాగం కావడం చాలా హ్యాపీ.దీని కోసం ఎంటైర్ టీమ్ ఎంతగానో కష్టపడింది.

సినిమాను భారీ స్థాయిలో రూపొందించారు.ఇది ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారు.

వారి స్పందించిన తీరుని నేనెప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.ఇప్పుడు స‌ర్దార్ సినిమా ఆహా డిజిట‌ల్ ద్వారా ఆడియెన్స్‌కి మ‌రింత చేరువ కానుంది.

త‌ప్ప‌కుండా సినిమా మ‌రింతగా అంద‌రికీ చేరువ అవుతుంద‌ని భావిస్తున్నాను.”ఖైది చిత్రంలో ఢిల్లీ అనే పాత్ర నుంచి ఇప్పుడు చేసిన సర్దార్ వరకు కార్తి వైవిధ్యమైన పాత్రలతో, యాక్ష్మన్ మూవీస్‌తో మెప్పిస్తూ వస్తున్నారు.

వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని ఆదరిస్తున్నారు.వెర్సైటైల్ చిత్రాలను అభిమానించే కార్తి ఫ్యాన్స్‌కి ఈ వారాంతంలోనూ ఆహా సెలబ్రేషన్స్ కోసం మరోసారి పిలుపునిచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube