ఉత్తర కొరియా ఉత్తర కుమారుడు అంటే మీకు మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది.అదేనండి, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.
కిమ్ జోంగ్ ఉన్ ని మొదటినుండి చూస్తే గనుక గొప్ప ప్రచార యావ కలిగిన వ్యక్తిగా కనబడతాడు.ఈ ప్రపంచం కూడా అతనిని అలాగే గుర్తించింది.
అయితే అతని గొప్పల తిప్పలు అక్కడి ప్రజలను ఎప్పటికన్నా బలిగొంటుంది అని ప్రపంచ మీడియాలో ఘోషిస్తున్నాయి.ఇక దీర్ఘకాలిక ఆహారకొరత ఆ దేశానికి కొత్తేమీ కాదుకానీ, గత కొన్నాళ్లుగా అక్కడ విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు అనేవి అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చాయి అని చెప్పుకోవాలి.
2021 కంటే 2022లో ఉత్తర కొరియా 1,80,000 టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసిందని భోగట్టా.నేడు ఈ దేశం రికార్డు స్థాయిలో దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి.ఇలాంటి దేశాన్ని అగ్ర దేశాల సరసన నిలబెట్టకపోయినా పర్వాలేదు గాని, కనీసం తమ ఉనికిని చాటుకోవలసిన పరిస్థితి అయితే వుంది కదా.కిమ్ జోంగ్ ఉన్ అక్కడ మిలిటరీని బలపరుచుకొనే బదులు దేశ రైతులను బాగుచేస్తే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పారదర్శకత లేని ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు అవహేళన చేస్తున్నాయి.అక్కడ ప్రభుత్వపు బాధ్యతా రాహిత్య చర్యలు ఆ దేశ ఆర్ధిక వ్యవస్థనే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా కృంగిపోయేలా చేస్తున్నాయని అక్కడి స్థానిక మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి.మహమ్మారి కరోనా సమయంలో ఉత్తర కొరియా పాలకులు తీసుకున్న చర్యలు ‘విపరీతమైనవి, మతిలేనివి’ అని ఉత్తర కొరియాలోని లింక్ అనే స్వచ్ఛంద సంస్థ దక్షిణ కొరియా డైరెక్టర్ సొకీల్ పార్క్ ఆ మధ్య పేర్కొన్న విషయం విదితమే.