స్టార్ హీరో బాలయ్యకు ఘోర అవమానం.. ప్రజల్లో స్పందన ఉన్నా ఇలా చేస్తే అన్యాయమే!

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతూనే మరొకవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బాలకృష్ణ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు.

 No Political Support For Star Hero Balakrishna Campaign,balakrishna,tdp,chandrab-TeluguStop.com

ఇది ఇలా ఉంది తాజాగా బాలయ్య బాబుకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.టీడీపీలో బాలయ్యకు ఘోర అవమానం జరుగుతోందా? అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.టీడీపీ పార్టీ( TDP ) నందమూరి వంశం నుంచి పుట్టిన పార్టీ.నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి ఆంధ్రుల ఆరాధ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Balakrishna, Chandrababu, Lokesh, Viceroy Hotel-Movie

ఆ తర్వాత వైస్రాయ్ హోటల్( Viceroy Hotel ) వేదికగా ఏం జరిగింది? తర్వాత ఎవరి చేతుల్లోకి పార్టీ వచ్చింది? ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లకు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో కనీసం అందులో సగం కూడా లేదన్నది నందమూరి అభిమానుల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న.నందమూరి వారసుడు అయినప్పటికీ ఆయన్ను ఎందుకింతలా చులకనగా చూస్తున్నారని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏపీ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.నాన్న పెట్టిన పార్టీ రాయలసీమలో మూడంటే మూడు సీట్లనే 2019 ఎన్నికల్లో దక్కించుకోగా ఈసారి సైకిల్ సత్తా ఏంటో చాటి చెప్పాలని స్వర్ణాంధ్ర సాకార యాత్ర( Swarnandhraa Sakara Yatra )కు బాలయ్య శ్రీకారం చుట్టారు.

Telugu Balakrishna, Chandrababu, Lokesh, Viceroy Hotel-Movie

గత మూడు రోజులుగా బాలయ్యకు నిజంగా వస్తున్న ఆదరణ చూసిన చంద్రబాబు, లోకేష్( Chandrababu Lokesh ) ఇతర అగ్రనేతలు ముక్కున వేలేసుకున్నారు.వాస్తవానికి ప్రజాగళం, యువగళం, నిజం గెలవాలి.బాబు రావాలి ఇలాంటి కార్యక్రమాలతో చంద్రబాబు, నారా లోకేష్.

నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) రాయలసీమలో సభలు నిర్వహించినప్పటికీ ఆదరణ అంతంత మాత్రమే వచ్చిందని చెప్పుకోవాలి.అయితే బాలయ్యకు మాత్రం భారీగా జనాధరణ లభించింది.ఎందుకంటే ఆయనుకున్న చరీష్మా కరేజ్ అలాంటిది మరి.ఇంత జరుగుతున్నా మూడు రోజులుగా బాలయ్య యాత్రను టీడీపీ అనుకూల మీడియా కానీ దినపత్రికలు కానీ కనీసం యూ ట్యూబ్ చానెల్స్ కానీ పట్టించుకోలేదు.అయితే గత మూడు రోజులుగా రాయలసీమలో జరుగుతున్న పరిణామాలు, టీడీపీ చేస్తున్న ట్వీట్లు, బాలయ్యకు వస్తున్న సపోర్టు చూస్తుంటే వందకు వెయ్యి శాతంగా ఆయన్ను టీడీపీ అగ్రనాయకత్వం చిన్నచూపు చూస్తోందని ఘోరంగా అవమానిస్తోందన్నది నందమూరి అభిమానులు చేస్తున్న ప్రధాన ఆరోపణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube