Niveda Thomas : పెళ్లిపై స్పందించిన నివేదా థామస్.. ఏకంగా గోరింటాకు ఫోటో చూపిస్తూ అప్పుడే పెళ్ళంటూ షాక్?

మామూలుగా పెళ్లికాని సెలబ్రెటీలకు నిత్యం పెళ్లిళ్ల గురించి బాగా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా మీడియా వాళ్ళు వాళ్ళ పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు.

 Niveda Thomas Reacted To The Wedding Shocked By Showing A Photo Of A Gorinta To-TeluguStop.com

ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా యాంకర్లు అడుగుతూనే ఉంటారు.ఇక జనాలలో కనిపించిన కూడా వెంటనే జనాలు అడిగేస్తూ ఉంటారు.

దీంతో చాలామంది సెలబ్రెటీలు తమ పెళ్లిళ్ల గురించి చెప్పలేక తప్పుకుంటారు.కొందరు మీకు అనవసరం అంటూ ముఖం మీదే కౌంటర్లు వేస్తూ ఉంటారు.

అయితే తాజాగా నివేద థామస్( Niveda Thomas ) కి కూడా ఇటువంటి ప్రశ్న ఎదురవటంతో వెంటనే ఆమె ఓ షాకింగ్ సమాధానం ఇచ్చింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా థామస్.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని కొంత అభిమానులను సొంతం చేసుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది.అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా సందడి చేస్తుంది.తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా థామస్ ఆ తర్వాత 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని( Nani ) నటించిన జెంటిల్ మెన్ ( Gentlemen )సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అలా కొన్ని సినిమాలలో సక్సెస్ అందుకున్న కూడా కొన్ని సినిమాలలో అంత సక్సెస్ పొందలేకపోయింది.

Telugu Gentlemen, Nani, Niveda Thomas, Pawan Kalyan, Tollywood-Movie

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించి వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక గత ఏడాది షాకిని డాకిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది.ఈ సినిమాలో మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కొంతవరకు నివేద థామస్ కు మంచి గుర్తింపును అందించింది.ఇక ఇదంతా పక్కన పెడితే.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.బాగా డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా తన తమ్ముడితో కూడా చిందులేసిన డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Gentlemen, Nani, Niveda Thomas, Pawan Kalyan, Tollywood-Movie

తనకు సమయం దొరికినప్పుడు ఎలా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్ల అడిగిన సమాధానాలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టగా అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.ఓ నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగటంతో.

ఆలోచన ఉద్దేశం ఏమీ లేవండి.ఉన్నప్పుడు లేదా ఉంటే చెప్తా అంటూ తను గోరింటాకు పెట్టుకున్న ఫోటోలు పంచుకుంది.

అంటే ఇప్పుడు ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube