‘మాచర్ల నియోజకవర్గం’లో నితిన్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవ ‘మాస్ట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Nithiin New Movie Title Macharla Niyojakavargam, Nithiin, Macharla Niyojakavarga-TeluguStop.com

ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే వినాయక చవితి సందర్భంగా నితిన్ తన తాజా చిత్రాన్ని ప్రారంభించాడు.

నితిన్ కెరీర్‌లో 31వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఇవాళ ఉదయం జరిగింది.అయితే ఈ సినిమా నుండి తాజాగా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.దీంతో ఈ సినిమా టైటిల్ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలను కూడా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాను ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కాగా ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మోషన్ పోస్టర్‌లో నితిన్ చాలా రఫ్ లుక్‌లో మనకు కనిపించాడు.ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తూ అర్థమవుతోంది.ఇక ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తుండగా, ఈ సినిమాలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమా టైటిల్ లాగానే ఇంట్రెస్టింగ్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube