'పుష్ప ది రూల్' లో మెగా ప్రిన్సెస్.. నిజమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అంటే ఇప్పుడు తెలియని వారు లేరు అంటే అతియసోక్తి కాదేమో.ఎందుకంటే ఈయన పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు.

 Niharika Konidela In Allu Arjun Pushpa 2 , Pushpa 2, Allu Arjun, Sukumar, Nihari-TeluguStop.com

ఇక ఈ సినిమా పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్” (Pushpa 2).పార్ట్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పార్ట్ 1 కంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమా నుండి ఏదొక వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

Telugu Allu Arjun, Pushpa, Sukumar-Movie

తాజాగా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ( Niharika Konidela ) కూడా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో ఒక కీలక రోల్ చేస్తున్నారు అనేది తాజా టాక్.ఈ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు.

మరి తాజాగా వైరల్ అవుతున్న ఈ వార్తపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Telugu Allu Arjun, Pushpa, Sukumar-Movie

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా అంచనాలు భారీగా పెంచేసాయి.ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ వంటి వారు నటిస్తున్నారు.ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube