‘పుష్ప ది రూల్’ లో మెగా ప్రిన్సెస్.. నిజమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అంటే ఇప్పుడు తెలియని వారు లేరు అంటే అతియసోక్తి కాదేమో.

ఎందుకంటే ఈయన పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు.

ఇక ఈ సినిమా పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ''పుష్ప ది రూల్'' (Pushpa 2).

పార్ట్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పార్ట్ 1 కంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమా నుండి ఏదొక వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

"""/" / తాజాగా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ( Niharika Konidela ) కూడా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఒక కీలక రోల్ చేస్తున్నారు అనేది తాజా టాక్.ఈ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు.

మరి తాజాగా వైరల్ అవుతున్న ఈ వార్తపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా అంచనాలు భారీగా పెంచేసాయి.

ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ వంటి వారు నటిస్తున్నారు.

ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన కోన్ ఐస్‌క్రీమ్.. వీడియో చూస్తే!