ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ సంక్రాంతికి గల్లా అశోక్ హీరో సినిమాతో వచ్చింది.ఈ సినిమాను ఆదిత్య శ్రీరాం డైరెక్ట్ చేశారు.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరో సినిమా ఈమాత్రం క్రేజ్ తెచ్చుకుంది అంటే అది నిధి అగర్వాల్ వల్లే అని చెప్పొచ్చు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ రెగ్యులర్ గా తన ఉప్డేట్స్ ఇస్తూ వస్తుంది.
ఇక లేటెస్ట్ గా జస్ట్ ఫర్ ఫన్ అంటూ నిధి అగర్వాల్ టాలీవుడ్ స్టార్ హీరోలని ఇమిటేట్ చేస్తూ ఓ వీడియో చేసింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చాయ్ కప్ వారు ఈ వీడియో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్.
గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్.ఆదిలో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ ఎన్.టి.ఆర్ డైలాగ్.బాలకృష్ణ ట్రబుల్ డైలాగ్.వెంకటేష్ గణేష్ డైలాగ్ ఇలా అన్ని కవర్ చేసింది.
సోషల్ మీడియా కోసం ఓ ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేస్తున్న నిధి.ఆమె కోసం స్పెషల్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటుందని చెప్పొచ్చు.