స్టూడెంట్ వీసా.. సంస్కరణలపై యూకే సర్కార్ ఫోకస్, అడ్వైజరీ ప్యానెల్‌ నియామకం

అంతర్జాతీయ విద్యార్ధులకు మరింత వేగంగా వీసాను మంజూరు చేయడానికి వీలుగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది యూకే ప్రభుత్వం. ఇందులో ఇమ్మిగ్రేషన్, విద్యా రంగ నిపుణులు సభ్యులుగా వుంటారు.

 New Expert Panel To Advise On Better Uk Visa Offer For Foreign Students Details,-TeluguStop.com

వీరిలో భారత సంతతికి చెందిన పలువురికి కూడా చోటు దక్కింది.యూకే యూనివర్సిటీల శాఖ మాజీ మంత్రి , ఎంపీ క్రిస్ స్కిడ్మోర్ అధ్యక్షతన ఈ కమీషన్ ఏర్పాటు చేశారు.

యూకే ప్రభుత్వం పోస్ట్ స్టడీ వర్క్ వీసా మార్గాన్ని, ఇతర చర్యలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఇటీవల పలు గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూకే సమాజానికి విదేశీ విద్యార్ధుల విలువను హైలైట్ చేయడం,

ఇతర వీసా ఆఫర్‌లతో కూడిన అంతర్జాతీయ విద్యా వ్యూహం 2.0 కోసం సిఫార్సులు చేయడం ఈ కమీషన్ ప్రధాన విధి.కమీషన్‌లో మంత్రులు లార్డ్ జో జాన్సన్, లార్డ్ డేవిడ్ విల్లెట్లస్, ప్రముఖ విద్యావేత్తలైన ప్రొఫెసర్ షితీజ్ కపూర్‌లు కూడా సభ్యులుగా వున్నారు.

భారత సంతతికి చెందిన సనమ్ అరోరా ఈ ప్యానెల్‌లో కమీషనర్‌గా నియమితులయ్యారు.ఈయన నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్‌ (ఎన్ఐఎస్ఏయూ, యూకే) వ్యవస్థాపకుడు.ఈ సందర్భంగా అరోరా మాట్లాడుతూ… భారత్, యూకేలకు సంబంధించినంత వరకు తాము కీలక తరుణంలో వున్నామన్నారు.

Telugu Chris Skidmore, Foreign, Passport, Sanam Arora, Uk Foreign, Uk, Uk Visa,

ప్రతి దేశం తన బలాలు, అవసరాలపై దృష్టి సారించి.భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఉదాహరణకు యూకేలో ప్రస్తుతం ఆతిథ్యం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు నైపుణ్యం కలిగిన మానవశక్తిని కనుగొనడంలో తీవ్రమైన సవాళ్లు వున్నాయన్నారు.

మెరుగైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో యూకేలో చదువుకున్న భారతీయ గ్రాడ్యుయేట్లకు వారి ప్రతిభకు సరిపోయే అవకాశాలను సృష్టించవచ్చని అరోరా అభిప్రాయపడ్డారు.

Telugu Chris Skidmore, Foreign, Passport, Sanam Arora, Uk Foreign, Uk, Uk Visa,

ఇకపోతే.ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాల ప్రకారం.విదేశీ విద్యార్ధుల జాబితాలో భారతీయులు గతేడాది చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు.

జూలై 2021లో ప్రవేశపెట్టిన కొత్త గ్రాడ్యుయేట్ వీసా రూట్ విధానం ప్రకారం.పోస్ట్ స్టడీకి రెండేళ్ల వరకు అనుమతించింది.

ఇందులోనూ 41 శాతం వీసాలతో భారతీయులు ఆధిపత్యం చలాయిస్తున్నారు.అయితే యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ మాత్రం పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్‌ను పరిమితం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube