జుట్టు రాలిపోవడానికి చుండ్రు కూడా ఒక కారణం అవుతుంటుంది.పైగా తలలో చుండ్రు ఉండటం వల్ల తీవ్రమైన దురద, చికాకు, మొటిమలు, జుట్టు పొడిగా మారడం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే చుండ్రు సమస్యను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు పరార్ అవ్వడమే కాదు జుట్టు ఒత్తుగా నల్లగా సైతం పెరుగుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో మరొక గిన్నె పెట్టుకోవాలి.ఈ గిన్నెలో ఒక కప్పు ఆముదాన్ని వేసుకోవాలి.
ఆముదం కాస్త హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి స్పూన్ తో బాగా తిప్పుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.
వారంలో రెండే రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక ఉపయోగిస్తే చుండ్రు అన్న మాటే అనరు.కేవలం కొద్ది రోజుల్లోనే చుండ్రు సమస్య పోతుంది.అదే సమయంలో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా నల్లగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.
కాబట్టి చుండ్రును పోగొట్టుకుని ఒత్తైన జుట్టును పొందాలని కోరుకునే వారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.