మారుతున్న కాలంతో పాటే శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి.ఎన్నో వ్యాధులకు మందులు, వ్యాక్సిన్లు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు.
ఫలితంగా ఎలాంటి జబ్బుల బారిన పడినా మనుషులు త్వరగా కోలుకుంటున్నారు.అయితే కొందరు వైద్యులు మాత్రం మంచి కోసం వినియోగించాల్సిన ఆవిష్కరణలను వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ వైద్య వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు.
టెక్నాలజీని చెడ్డ దారిలో వినియోగించి మంచి డాక్టర్లకు సైతం చెడ్డపేరు తీసుకొస్తున్నారు.ఆ డాక్టర్ చేసిన అక్రమాల గురించి అవాక్కవ్వడం ఆ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న మహిళ వంతయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్ దేశంలో ఒక వైద్యుడు ఉన్నాడు.అ వైద్యుని వయస్సు 89 సంవత్సరాలు.
ఈ డాక్టర్ కు దేశంలోని రొట్టెర్ డ్యామ్ అనే ప్రాంతంలో ఐవీఎఫ్ క్లినిక్ ఉంది.
సంతాన భాగ్యం లేని మహిళలను ఐవీఎఫ్ పద్ధతి ద్వారా డాక్టర్ సంతానం కలిగేలా చేసేవాడు.
సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో ఆ డాక్టర్ కు స్థానికంగా మంచిపేరు వచ్చింది.అయితే ఆ డాక్టర్ వైద్య వృత్తికే కలంకం తెచ్చేలా 49 మంది మహిళలకు వారి భర్తల స్పెర్మ్(శుక్రకణాలు), దాతల స్పెర్మ్ కాకుండా తన స్పెర్మ్ వినియోగించాడు.
ఇంత ఘోరానికి పాల్పడిన ఆ వైద్యుని పేరు జాన్ కర్బాత్.
కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ ద్వారా అక్కడి కోర్టు ఆ ఆస్పత్రిలో జరిగిన ఐవీఎఫ్ కేసుల్లో పుట్టిన పిల్లలందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించింది.
అలా పరీక్షలు చేయగా 49 మంది పిల్లలకు జాన్ కర్భాత్ తండ్రి అని తేలింది.కొందరు ఆ డాక్టర్ తాను పదుల సంఖ్యలో పిల్లలకు తండ్రి అవుతాడని చెప్పేవాడని చెబుతున్నారు.
అయితే జాన్ కర్భాత్ ఇప్పటికే చనిపోవడంతో అతన్ని శిక్షించే అవకాశం లేకుండా పోయింది.