నాని నమ్మకాన్ని 'దసరా' నిలబెట్టుకుంటుందా?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న సినిమా ”దసరా”.న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్ లో రిలీజ్ కాబోతుంది.

 Nani Is Super Confident On Dasara And Says It's An Epic, Nani, Dasara, Keerthy S-TeluguStop.com

ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు.

ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుంది.ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంది.

Telugu Dasara, Keerthy Suresh, Nani-Movie

ఈ సినిమాపై ముందు నుండి నాని గట్టి నమ్మకంతో ఉన్నాడు.ప్రమోషన్స్ లో ప్రతీ చోట కాన్ఫిడెంట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది చెప్పుకొస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ లో కూడా నాని మాట్లాడుతూ.

ఈ సినిమాకు ఇక ఆల్ ది బెస్ట్ లు ఉండవు.కేవలం కంగ్రాట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.

Telugu Dasara, Keerthy Suresh, Nani-Movie

దీంతో నాని ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం అవుతుంది.మరి నాని నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube