ఊపిరి సినిమా కొందాం అని చూస్తున్న నాగార్జున ?

మొట్ట మొదటి ద్విభాషా మల్టీ స్టారర్ సినిమా ఊపిరి లో హీరోగా చేస్తున్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ఇచ్చిన సూపర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.హాలీవుడ్ ఇన్ తచ్చబుల్స్ సినిమా కి అఫీషియల్ రీమేక్ గా చెబుతున్న ఈ సినిమా లో నాగార్జున తో పాటు తమిళ హీరో కార్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

 Nagarjuna Planning To Buy Oopiri Distribution Rights-TeluguStop.com

తమన్నా హీరోయిన్ అయితే ఈ సినిమా మీద నాగార్జున చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు అంటున్నారు.

ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచి టాప్ గ్రాసర్ గా ఉన్న నాగ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తాను హీరోగా చేస్తున్న ఊపిరి మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడు అని తెలుస్తోంది.

సినిమా రష్ చూసి సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందనే భరోసాతో సినిమా బిజినెస్ గురించి డెఫినెట్ హిట్ అంటూ తన సన్నిహితులకు సలహాలు కూడా ఇస్తున్నాడట.అంతేకాదు ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్.

అందుకే సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయాల్సింది మార్చ్ 25న వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇదే విషయంలో నాగ్, కార్తిల మధ్య కొంతకాలం చర్చలు జరిగినా చివరకు నాగార్జున మాటే చెల్లింది.

మార్చ్ నెల ఆఖరు ఊపిరి రిలీజ్ అవుతుంది.ఈ సినిమాని కొన్ని ప్రాంతాల్లో కొని నాగార్జున డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే ఆలోచనలో ఉన్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube