తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తూ సినిమాల్లో నటించడమే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఒకప్పుడు నాగార్జున హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా వచ్చిన ‘మన్మధుడు ‘ సినిమా( ‘Manmadhudu’ movie ) మంచి విజయాన్ని సాధించింది.
అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అన్షు( Anshu ) కి మంచి గుర్తింపు వచ్చింది.అయినప్పటికి ఆమె ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలేవి చేయలేదు.మరి ఏది ఏమైనా కూడా ఆమె సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి దూరంగా ఉంటూ వస్తుంది.ఇక ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన ( Trinadha Rao )దర్శకత్వంలో వస్తున్న మజాకా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మజాకా సినిమాకి ( Majaka movie )సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ఇది చాలా అట్రాక్టివ్ గా ఉండటమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉండటం విశేషం.
కమర్షియల్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అన్షు పాత్ర చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక టీజర్ లో కూడా ఆమెకు సంబంధించిన పాత్రను ఎలివేట్ చేస్తూ టీజర్ కట్ అయితే ఇచ్చారు.మరి మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ కిషన్ మరోసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ని అన్షు చాలా గొప్పగా స్టార్ట్ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా సక్సెస్ అయితే అన్షు కి కూడా ఇక మీదట మంచి అవకాశాలు దక్కే ఛాన్సులు అయితే ఉన్నాయి…
.