మహేష్ బాబుకు జేజేలు కొట్టిన నాగ చైతన్య.. ఎందుకంటే..?!

తాజాగా ఓ సంఘటనలో భాగంగా ఒక్కడు సినిమా రిలీజ్ సమయంలో హీరో మహేష్ బాబు భారీ కటౌట్ కు అక్కినేని హీరో అక్కినేని నాగచైతన్య క్షీరాభిషేకం చేశాడు.అంతే కాదు అక్కడ ఉన్న ఎంతోమంది అభిమానులు కూడా మహేష్ బాబుకు పెద్ద ఎత్తున జేజేలు కొట్టారు.అదేంటి ఒక్కడు సినిమా ఎప్పుడో వచ్చేసింది కదా.ఇప్పుడు ఎందుకు జేజేలు కొడుతున్నారు అని అనుకుంటున్నారు కదా.అందులోనూ అక్కినేని వారసుడు మహేష్ బాబు కటౌట్ కి క్షీరాభిషేకం చేయడం ఏంటి.?! అని మైండ్ బ్లాక్ అవుతుంది కదా.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Nagachaitanya Praises Maheshbabu With Huge Claps As A Part Of Thank You Movie Sh-TeluguStop.com

ఈ సంఘటన మొత్తం సోమవారం నాడు రాజమహేంద్రవరం లోని అశోక థియేటర్ వద్ద జరిగింది.

విక్రమ్ కుమార్ దర్శకత్వం, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లో అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వీరు నటిస్తున్న సినిమాకు ‘థాంక్యూ‘ అనే నామకరణం చేశారు.అయితే ఈ చిత్రంలోని షూటింగ్ నేపథ్యంలో భాగంగా ఒక్కడు సినిమా రిలీజ్ సన్నివేశంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Telugu Mahesh Babu, Naga Chaitu, Okkadu, Latest-Latest News - Telugu

ఈ సంఘటనలో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒక్కడు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ బాబుకు సంబంధించిన కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు పాటు.థియేటర్ లో హీరో హీరోయిన్ల మధ్య మరికొన్ని సన్నివేశాలను తీశారు దర్శకనిర్మాతలు.దీంతో రాజమహేంద్రవరంలో థియేటర్ వద్ద నాగచైతన్య ను చూసేందుకు అక్కినేని అభిమానులతోపాటు చాలామంది పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడి సందడిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube