హమ్మయ్య ఇన్ని పాజిటివ్ ల మద్య ఒక నెగటివ్ వార్తతో ఊరట

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ సమయం లో సినీ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

 Music Director S Thaman Out Of From Covid 19 He Is Now Covid Negative , Thaman,-TeluguStop.com

మహేష్ బాబు మొదలుకొని హీరోలు హీరోయిన్లు చాలా మంది కూడా కరోనా ను ఎదుర్కొంటున్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.కరోనా మూడవ వేవ్ చాలా ప్రమాదకరంగా మరియు స్పీడ్ గా ఉందంటూ నిపుణులు చెబుతూనే ఉన్నారు.

అయినా కూడా సెలబ్రిటీలు ఎక్కువ శాతం మంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు పాజిటివ్ అంటూ ప్రకటిస్తున్న కారణంగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.

అందరూ పాజిటివ్ అంటూ చెబుతున్న సమయంలో ఒక్క నెగిటివ్ వార్త అందరిలో ఆనందాన్ని కలిగించింది.

సాధారణంగా అయితే నెగిటివ్ అంటే అంతా మంచిది కాదని.కానీ ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ నెగిటివ్ కోరుకుంటున్నారు.

నెగటివ్‌ వచ్చిందంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అందుకే తాజాగా తమన్‌ తనకు నెగిటివ్ వచ్చింది అంటూ ప్రకటించిన వెంటనే అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Corona, Covid, Mahesh Babu, Thaman, Tollywood-Movie

ఆయన ఇటీవలే కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.ఆయన కోవిడ్‌ నుంచి చాలా త్వరగా రికవరీ అవ్వడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇతర సినీ ప్రముఖులు కూడా వెంటనే కోవిడ్‌ నెగిటివ్ అవ్వాలని.ఎవరికీ ఏమీ కాకుండా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.ఇలాంటి నెగిటివ్ వార్తలు మరిన్ని వినాలి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.ఇక కోవిడ్‌ ను జయించిన తమన్‌ ఈ ఏడాదిలో మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ అందించాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube