రైల్వే ట్రాక్ పై పడ్డ పిల్లలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి.. చివరకు?

ఈ సృష్టిలో తల్లి ప్రేమకు ఏదీ సాటిరాదనే సంగతి తెలిసిందే.పిల్లలను కంటికి రెప్పగా చూసుకునే తల్లులు దేశంలో ఎంతోమంది ఉన్నారు.

 Mothers Love Mother Covers Children With Her Body From Train Accident , Bihar ,-TeluguStop.com

పిల్లల కోసం ఇంటికే పరిమితమై పిల్లల సక్సెస్ ను తమ సక్సెస్ గా చూసుకునే తల్లులకు కొదువ లేదు.తాజాగా ఒక తల్లి రైల్వే ట్రాక్ ( Railway track )పై పడ్డ పిల్లలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

బీహార్ రా( Bihar )ష్ట్రంలోని భార్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

విక్రమ్ శిలా ఎక్స్ ప్రెస్ కోసం ప్రయాణికులు ఎదురు చూస్తుండగా ఒక తల్లి ఇద్దరు బిడ్డలతో పాటు ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించింది.అదే సమయంలో కాలు జారడంతో పిల్లలతో పాటు ట్రాక్ పై పడింది.అదే సమయంతో రైలు మూవ్ అవుతుండటంతో తను పిల్లలను కప్పేసింది.

అయితే అదృష్టం కలిసొచ్చి తల్లి, పిల్లలకు ఏమీ కాలేదు.ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడిన ఆ తల్లి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాను చనిపోయినా పిల్లలు బ్రతకాలని తల్లి చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది.తన శరీరాన్ని రక్షణగా ఉంచి బిడ్డ ప్రాణాలను కాపాడిన తల్లి మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రైలు ఎక్కడానికి ఎక్కువమంది పోటీ పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.ఆ తల్లికి ఇకపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ఎలాంటి కష్టం రాకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ తల్లి, పిల్లలు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube