టీవీ చూస్తున్న పిల్లలను దెయ్యంతో భయపెట్టిన తల్లి.. వీడియో వైరల్..

ఈరోజుల్లో పిల్లల నుంచి తల్లుల వరకు అందరూ సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు.ఏదో ఒక చిలిపి పనిచేసి ఆ క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నారు.

 Mother Who Scared Children Watching Tv With Ghost Video Viral , Viral News, Late-TeluguStop.com

అయితే కొందరు లైక్స్ కోసం, తమ ఆనందం కోసం మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు.సోషల్ మీడియా మాయలో పడిపోయి అంగీకరించదగని పనులు కూడా చేస్తున్నారు.

తమ సంతోషం కోసం చివరికి చిన్న పిల్లలను కూడా బలి చేస్తున్నారు.తాజాగా ఒక తల్లి తన పిల్లలను ప్రాంక్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది.

ఆ వీడియోను ట్విట్టర్ పేజీ @ సీసీటీవీఇడియట్స్ షేర్ చేసింది.దానికి ఇప్పటికే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ముగ్గురు పిల్లలు( Three children ) టీవీ చూస్తూ ఉండటం కనిపిస్తుంది.ఆ టీవీలో ఒక కారు పచ్చని చెట్ల మధ్య వేసిన రోడ్డుపై వెళ్తూ కనిపించింది.కొద్దిసేపటికి కారు స్క్రీన్ లో కనిపించకుండా పోయింది.దాంతో పిల్లలు కారు ఎటు వెళ్ళిపోయిందా అని చూస్తూ ఉన్నారు.ఇంతలోనే సడన్ గా ఒక దెయ్యం బొమ్మ( ghost doll ) స్క్రీన్ పై కనిపించింది.అంతేకాదు గుండె ఆగిపోయేటటువంటి సౌండ్ కూడా దెయ్యంతో పాటు ప్లే అయ్యింది.

సడన్‌గా ఆ సౌండ్ విని, దెయ్యాన్ని చూసి పిల్లలు బాగా భయపడి పోయి టీవీ నుంచి దూరంగా ఉరికారు.ఈ సమయంలో ఒక చిన్నారి కింద కూడా పడింది.

ఇలా తల్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ వీడియో షేర్ చేసిన ట్విట్టర్ పేజీ ఫాలోవర్లను అడిగింది.తన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎమోషనల్‌గా పిల్లలను భయపెట్టడం ఏమాత్రం సరైనది కాదు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.ఈమె చాలా చెడ్డ తల్లి, ఈ ఘటనను వారు జన్మలో మర్చిపోలేరు అని ఒక నెటిజన్ తిట్టిపోశాడు.మరికొందరు మాత్రం తల్లి చేసిన పనిలో తప్పేం లేదు అంటున్నారు.

టీవీని మరి అంత దగ్గరగా చూడకుండా పిల్లలను భయపెట్టినట్లు ఇది అవుతుందని అన్నారు.ఏది ఏమైనా ఈ తల్లి చేసిన పనికి వ్యతిరేకతే ఎక్కువ వచ్చింది.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube