పిల్ల కోతి కోసం 'సినిమా స్టైల్'లో స్టంట్ చేసిన తల్లి కోతి!

తల్లి ప్రేమని మాటల్లో చెప్పలేం.ఎంత మాట్లాడిన తక్కువే.

 Mother's Love, Animals, Monkey, Cable Wire, Building, Video, Social Media,mother-TeluguStop.com

అలాంటి ఈ ప్రేమ కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు పుట్టిన ప్రతి జీవికి తల్లి ప్రేమ అనేది ఉంటుంది.చెప్పాలి అంటే మానుషాలకంటే కూడా జంతువులకే తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుంది.

పిల్లలకు ఏలాంటి హాని జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటాయి.ఇంకా వాటి పిల్లలు ప్రమాదంలో ఉన్నాయి అని తెలిస్తే ఎలా అయినా సరే కాపాడుకోవాలి అని అనుకుంటాయి.

అలానే ఓ కోతి కూడా అదే చేసింది.సాధారణంగానే కోతులు అల్లరి చేస్తాయ్.ఇంకా కొండముచ్చులు అయితే మరి దారుణంగా అల్లరి చేస్తాయ్.ఇంకా అలానే ఓ పిల్ల కోతి కేబుల్ వైర్లు పట్టుకొని వేలాడింది.

అయితే, ఆ కొండుముచ్చు తీగల మీద నుంచి పక్కనే ఉన్న భవనం మీదకు దూకలేక ముప్పు తిప్పలు పడింది.ఇది చూసి తల్లి కొండముచ్చు భయపడిపోయింది.

వెంటనే పిల్లను కాపాడేందుకు వైర్ల మీదకు దూకి పిల్లను పట్టుకొనేందుకు ప్రయత్నించింది.కానీ సాధ్యం కాలేదు.దీంతో మళ్లీ బిల్డింగ్ మీదకు దూకింది.రెండోసారి మాత్రం సినిమా స్టైల్ లో ఒక్క ఉదుటున తీగల మీదకు దూకి.

బిడ్డను హత్తుకుని క్షణాల్లో బిల్డింగ్ మీదకు దూకి బిడ్డను కాపాడింది.ఇంకా ఇది అంత వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.

దీంతో తల్లి ప్రేమ అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube