Most Consumed Meat : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే మాంసాహారం ఏంటో తెలుసా..?! మరి భారత్ లో..?!

ప్రపంచవ్యాప్తంగా శాఖాహారులు కంటే మాంసాహారులు( Non Vegetarians ) ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే.ఇకపోతే ఒక్కో దేశంలో ఒక్కోరకంగా వారు వంటకాలను తయారు చేసుకుంటూ భుజించడం మనం సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉంటాం.

 Most Consumed Meats In The World-TeluguStop.com

అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మాంసాహార వినియోగం ఎక్కువ కావడానికి కారణం మాంసాహారం తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో దొరకడమే.ఇక అసలు విషయంలోకి వెళితే.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఏ మాంసాన్ని ఇష్టపడతారో వాటి వివరాలు చూద్దాం.తాజా లెక్కల ప్రకారం.

ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం 400 మిలియన్ టన్నుల వరకు చేరిందని అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజల ఆదాయం పెరగడంతో పాటు వారి ఆరోగ్యం పై కూడా మంచి స్పృహను కలగజేసుకుంటున్నారు.

Telugu Goat, Meats, Consumed Meats, Vegetarians, Pork Meat, Turkey Hen-Latest Ne

ఇందులో భాగంగానే కొన్ని రకాల మాంసాలకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది.ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎక్కువగా ఇష్టపడే మాంసాలలో మొదటి స్థానం ఫోర్క్ ( Pork Meat ) కు లభించింది.ఆ తర్వాత స్థానాల్లో చికెన్, గొడ్డు మాంసం చేరాయి.వీటికి కాస్త ధర తక్కువ కావడంతో ప్రజలు వీటికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.వీటి తర్వాత స్థానంలో మేకల మాంసం ఆ తర్వాత టర్కీ కోడి మాంసం( Turkey Hen Meat ) లిస్టులో ఉన్నాయి.వీటిని ఎక్కువగా మెక్సికో, ఉత్తర అమెరికా ప్రాంతాలలో ప్రజలు తీసుకుంటారు.

ఆ తర్వాత స్థానాలలో బాతు మాంసం నిలిచింది.అమెరికా, చైనా దేశాలలో ప్రజలు వీటిని తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

ఆ తర్వాత స్థానాల్లో గేదె మాంసం, కుందేలు మాంసం, జింక మాంసం వంటివి ఉన్నాయి.

Telugu Goat, Meats, Consumed Meats, Vegetarians, Pork Meat, Turkey Hen-Latest Ne

ఇక భారత్ విషయానికి వస్తే.ఈ మధ్యకాలంలో మాంసాహారం కంటే శాఖాహారం( Vegetarians ) తీసుకున్న వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు.మాంసాహారం అంటే శాఖాహారానికి భారతీయులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొన్ని సర్వేల ప్రకారం మూడింట రెండు వంతులు మాంసాహారం తీసుకునే వారే అని తేలిన ప్రపంచవ్యాప్తంగా సగటుపరంగా చూస్తే భారత్ చాలా తక్కువ స్థానంలో ఉంది.దీనికి కారణం భారత్లో అనేక ఆధ్యాత్మిక భావాలు, అలాగే సంప్రదాయాలు లాంటి పట్టింపులు ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube