హిందూపురం పట్టణంలోని సరస్వతి విద్యామందింలో వసంత పంచమి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో కంప్యూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ.ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్.
స్వర్గీయ ఎన్టీ రామారావు మహిళలకు పెద్ద పీట వేసి గౌరవించారు.మహిళలకు ఆస్తిలో సమాన హక్కు , మహిళ డిగ్రీ కళాశాలలు, మహిళా యూనివర్సిటీ , చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు.
రాయలసీమలో పరిశ్రమలు లేవు నీరుద్యోగులంతా వలసలు వెళ్లే పరిస్థితి.ఎన్టీ రామారావు గారు హిందూపురంలో పారిశ్రామిక వాడ , చంద్రబాబు నాయుడు పెనుకొండలో అంతర్జాతీయ కియా కార్ల పరిశ్రమలతో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు ,నిరుద్యోగులు వలస వెళుతున్నారు.నా అల్లుడు నారా లోకేష్ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం రేపటి నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు.నా కూతురు నారా బ్రహ్మణి హెరిటేజ్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.హిందూపురంలో స్కూల్ విద్యార్థులకు బాలికలకు లాప్ ట్యాప్ లు, సోలార్ వాటర్ హీటర్లు, సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేశాం.

నా సినిమాల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతున్నాను.హిందూపురం ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్న , భగవంతుడు నాకు గొప్ప అదృష్టం కల్పించారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ ఒక చంద్రబాబు కావాలి.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు పాలన కావాలి.ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యం మా నాన్న కూడా నన్ను డిగ్రీ చదివ కుండా సినిమాల్లో రావద్దన్నారు.డిగ్రీ పాసైన తర్వాతనే నన్ను సినిమాల్లోకి అనుమతించారు.