మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామం అయినా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లో ఇవాళ పర్యటించారు.ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించిన మంత్రి అనంతరం నియోజకవర్గస్థాయి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హై లెవెల్ కెనాల్ పనులపై అధికారులతో చర్చించారు.నిర్మాణ పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే కెనాల్ పనులు 60 శాతానికి పూర్తయ్యాయని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఆర్డీవో చైత్ర వర్షిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.