తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలవనున్నారని తెలుస్తోంది.
మెట్రో రెండో దశ పనులకు కేంద్రం సాయం చేయాలని మంత్రి కేటీఆర్ కోరనున్నారని సమాచారం.లక్డికపూల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణతో పాటు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు కలిసి రావాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరనున్నారు.
మరోవైపు పటాన్ చెరున నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణకు కేంద్రం సాయం చేయాలని కోరుతున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.