షర్మిల క్లారిటీ ఇచ్చిందా ? డౌట్ పెంచిందా ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) చుట్టూ తిరుగుతున్నాయి.ఈమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలుపబోతుందని ఇలా రకరకాల వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో తెగ వినిపిస్తున్నాయి.

 Has Sharmila Given Clarity? Doubt Raised, Y. S. Sharmila , Ysr Telangana Party,-TeluguStop.com

గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ లోని కీలక నేతలతో షర్మిల తరచూ బేటీ అవుతూ ఆ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు షర్మిల కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తామని హస్తం నేతలు కూడా చెబుతున్నారు.

దీంతో ఆమె కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party )ని విలీనం చేయడం ఖాయమనే వాదన పెరుగుతూ వచ్చింది.

Telugu Congress, Telangana, Ys Sharmila-Politics

అయితే తనపైగాని పార్టీపై గాని ఎలాంటి అసంబంధ వ్యాఖ్యలు తెరపైకి వచ్చిన వెంటనే ఖండించే షర్మిల. కాంగ్రెస్ లో చేరికపై మాత్రం నిన్న మొన్నటి వరకు స్పందించలేదు.ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఇటీవల మాట్లాడుతూ షర్మిల తమతో టచ్ లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆమె కాంగ్రెస్ గూటికి చేరడం కన్ఫర్మ్ అనుకున్నారంతా.ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేధికగా షర్మిల ఈ వార్తలన్నిటికి చెక్ పెట్టె ప్రయత్నం చేశారు.” వైఎస్ షర్మిల రెడ్డి తెలంగాణ బిడ్డగా చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడుతుందని, ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు తెలంగాణ ప్రజలకు దూరం పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, పని లేని, పస లేని వ్యాఖ్యలు చేసే వారు.కే‌సి‌ఆర్ పాలనను ప్రశ్నించడంపై దృష్టి పెట్టాలని, నా భవిష్యత్ తెలంగాణ కోసమే, తెలంగాణ లోనే, నా ఆరాటం నా పోరాటం తెలంగాణ కోసమే ” అంటూ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.

Telugu Congress, Telangana, Ys Sharmila-Politics

అయితే షర్మిల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమె తెలంగాణలోనే తన రాజకీయ జీవితం కొనసాగించబోతుందనే స్పష్టత వచ్చింది.అయితే కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో అంతర్గతంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ మద్య మంతనాలు జరుగుతున్నట్లే కనిపిస్తోందంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.మొత్తానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫ్యూచర్ ఫాన్స్ పై షర్మిల క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి ఇంకా డౌట్ పెంచిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube