యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి....

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో చేసే పనులతో కటకటాల పాలు అవుతున్నారు.తాజాగా ఓ యువతి బాత్రూంలో స్నానం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఈ వీడియో తీసి ఆపై లైంగిక వాంఛలు తీర్చాలంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Men Arrested In Tamilnadu-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకి చెందినటువంటి రాజపురం ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి స్నానం చేయడానికి బాత్ రూమ్ కి వెళ్లగా అదే ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి ఎబేసన్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు మరో ఇద్దరు కలిసి తమ చరవాణిలో వీడియో తీశారు.

అంతేకాక వారి లైంగిక కోరికలు తీర్చాలని అంటూ ఆ యువతిని ఇబ్బంది పెట్ట సాగారు.అలాగే వారు చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియోని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు.

దీంతో పరువు గురించి ఆలోచించిన ఆ యువతి తనలో తానే మధన పడుతూ ఉండేది.

Telugu Tamilnadu-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

అయితే ఎలాగో ధైర్యం చేసినటువంటి ఆ యువతి తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అప్పటికే విషయం తెలుసుకున్న ఆ ముగ్గురు నిందితులు పరారయ్యారు.

అయితే ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరైన టువంటి ఎబెసన్ అనే నిందితుడు తెంగాయ్ పట్టినం తీరంలో తలదాచుకుం టుం డగా పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.అలాగే మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube