వీరయ్య ఎనర్జీకి మెగా ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే.. సంక్రాంతి రచ్చ షురూ!

ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.మెగాస్టార్ నటించిన ”వాల్తేరు వీరయ్య” సినిమాతో సంక్రాంతి సందడి తీసుకు వచ్చాడు.

 Megastar Chiranjeevi Waltair veerayya live updates, Megastar Chiranjeevi, Wal-TeluguStop.com

సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఫారిన్ లో కూడా వాల్తేరు వీరయ్య సందడి కనిపిస్తుంది.ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తెల్లవారు జాము నుండే మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది.

వాల్తేరు వీరయ్య ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.ముందు నుండి చిరు చెప్పిన విధంగా రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.

వింటేజ్ చిరుని చూపించి మెగా ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అనేలా చేయడంతో నూరుశాతం సక్సెస్ అయ్యాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.

ఈ సినిమా కోసం ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.అనుకున్న విధంగానే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ను కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండడంతో మెగా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.చిరు లోని ఎనర్జీ, కామెడీ టైమింగ్, చిలిపితనం, మాస్ యాటిట్యూడ్ అందరికి కనెక్ట్ అయ్యాయి.

చాలా రోజుల తర్వాత చిరు గ్రేస్ వింటేజ్ లుక్ తో కనిపించి మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు.అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇదే అంటూ మాస్ జాతర అందించాడు.ఇక చిరుతో పాటు రవితేజ, శృతి హాసన్ కూడా మెప్పించారు.

దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు.మొత్తానికి లేటుగా ఎంట్రీ ఇచ్చినా చిరు సినిమాతో సంక్రాంతి రచ్చ షురూ అయ్యింది.

చూడాలి మెగా ఫ్యాన్స్ వీరయ్యను ఏ రేంజ్ లో హిట్ చేస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube