అంతా బాగానే ఉంది కానీ వాల్తేరు వీరయ్య లో ఆ ఒక్కటే మిస్ అయ్యింది 

అదే చిరంజీవి.అవే డ్రెస్సులు, రొటీన్ మసాలా.

 Minus Points In Chiranjeevi Waltair Veerayya Movie Details, Chiranjeevi, Waltair-TeluguStop.com

ప్యూర్ కమర్షియల్ హంగులు. వెరసి అన్ని ఉన్న వాల్తేరు వీరయ్య లో మిస్ అయ్యింది ఒక కథ మాత్రమే.

సినిమాలో బాగున్న విషయాలు చాలానే ఉన్న ఎందుకో కొంత మేర మాత్రమే ప్రేక్షకుడిని మెప్పించ గలుగుతుంది.బాలయ్య సినిమా తో పోల్చుకుంటే ఖచ్చితంగా బెటర్ సినిమానే.

పైగా బాలయ్య సినిమా ఫంక్షన్ కి వచ్చిన శ్రుతి హాసన్ వాల్తేరు వీరయ్య కి మాత్రం రాలేదు.

ఆమె అలా చేయడం పట్ల అందరూ చిరు పైన బాలయ్య డామినేషన్ కనిపించింది.

కానీ సినిమా ఔట్ ఫుట్ చూశాక మాత్రం మెగా స్టార్ చిరు క్లియర్ డామినేషన్ కనిపించింది.కానీ అసలు సమస్య అంతా కథ తోనే వచ్చింది.పోయి పోయి చిరు ఎప్పుడు నా ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీశాను అంటూ చెప్తూ వస్తున్నారు.కానీ చిరు అభిమానికి ఏం కావాలో అది దొరికిందా అంటే కష్టమే.

మెగా అభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్దం చేసుకోలేదు అని చెప్పాలి.

ప్రేక్షకుల పరిది దాటి బయటకు వచ్చి చిరంజీవి ఆలోచించినప్పుడు సినిమాలు విజయవంతం అవుతాయి.ఇలాంటి విషయాల్లో మలయాళ స్టార్ హీరోలైన మమ్ముట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్ వంటి వారిని చూసి అయిన చిరంజీవి నేర్చుకోవాలి.ఈ మధ్య కమల్ హాసన్ కూడా గాడిలో పడ్డాడు.తనకు అర్దం అయ్యింది.సినిమా అంటే కథ, కథనం మనకు మాత్రమే కాదు ప్రేక్షకులకు నచ్చాలి అని.ఓవరాల్ గా సినిమాలో శ్రుతి హసన్ చాలా బాగుంది.

రవి తేజ కూడా మెప్పించాడు.అలాగే చిరంజీవి మెరుపుల కన్నా కూడా దేవి శ్రీ ప్రసాద్ అరుపులు చక్కగా ఉన్నాయి.శేఖర్ మాస్టర్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి.

ఇక చిరంజీవి కి ఫైట్స్ అంటే మహా ఇష్టం.అవి కూడా పర్వాలేదు అనిపించారు.

ఇక ప్రకాష్ రాజ్ తెలుగు వారికి బోర్ కొట్టేసాడు.కానీ డైరెక్టర్స్ మాత్రం ఆయన్ని వదలడానికి రెఢీ గా లేరు.

ఈ సినిమా భారీగా హిట్ అయిన క్రెడిట్ మొత్తం రవి తేజ కు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube