తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి కి ఉన్న క్రేజ్ వేరు.అంతకు ముందు ఉన్న ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు,ఫైట్ల నీ తను చేసి ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి చిరంజీవి.
తెలుగు సినిమా పరిశ్రమ చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత చేంజ్ చేసిన ఘనత చిరంజీవికి మాత్రమే దక్కుతుంది.ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి నటన మీద ఉన్న ఇంటరెస్ట్ తో చెన్నై వచ్చి చిన్నచిన్న అవకాశాలను అంది పుచ్చుకుంటూ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సుప్రీం హీరోగా ఎదిగి ఆ తర్వాత మెగాస్టార్ అనిపించుకున్నాడు.
ఇండియాలో ఏ హీరో కూడా టచ్ చేయని రేంజ్ కి వెళ్ళిపోయాడు చిరంజీవి గురించి చెప్పాలంటే ఆయన చేసిన సినిమాలు ప్రతిదీ ఒక అద్భుతం అని చెప్పాలి.ఇప్పటికీ చిరంజీవి చేసే ప్రతి సినిమాని తన మొదటి సినిమాలా భావించి చేస్తాడు అని చాలా మంది అంటుంటారు.
ఎందుకంటే మొదటి సినిమాకి మనం ఎంత ఎఫర్ట్ అయితే పెడతాము ఇప్పుడు కూడా చిరంజీవి అంతే ఎఫర్ట్ పెడతారని చాలామంది అంటుంటారు.అయితే చిరంజీవి పేరిట కొన్ని అరుదైన రికార్డులు నెలకొల్పి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో షోలే లాంటి సినిమాతో మంచి గుర్తింపు సాధించిన అమిత బచ్చన్ లాంటి హీరో కంటే కూడా చిరంజీవి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా గుర్తింపు పొందాడు.ఫస్ట్ టైం అమితాబచ్చన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు ఎంత అంటే ఒక సినిమాకి 1.25 కోట్లు తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతోపాటు సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కి ఇన్వైట్ చేయబడిన మొట్ట మొదటి హీరో కూడా చిరంజీవి గారే.ఘరానా మొగుడు సినిమా తో ఫస్ట్ టైం పది కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు, ఆ తర్వాత ఇంద్ర సినిమాతో ఫస్ట్ టైం 30 కోట్లు సాధించిన హీరోగా కూడా గుర్తింపు పొందాడు.
చిరంజీవి కెరియర్ లో ఏ హీరోకి సాధ్యం కాని ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రికార్డు కూడా చిరంజీవి పేరిటే ఉంది అవి ఏంటంటేఖైదీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి,యముడికి మొగుడు,గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, ఇంద్ర లాంటి సినిమాలతో 8 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.
అలాగే ఇండియాలో మొట్ట మొదటగా ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా గుర్తింపు పొందాడు.లగాన్ సినిమా కోసం అమీర్ ఖాన్ 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఆ రికార్డ్ ని క్రాస్ చేస్తూ చిరంజీవి ఏడు కోట్లు తీసుకున్నాడు.దీంతోపాటు ఇండస్ట్రీలో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు.దీంతోపాటు ఇండస్ట్రీలో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు.
దీంతోపాటు ఇండస్ట్రీలో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న.
ఎవరికీ సాధ్యం కానీ చాలా రికార్డులను అలవోకగా క్రాస్ చేసిన రికార్డు మాత్రం ఇప్పటికీ చిరంజీవికే ఉంది.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య మూవీలో నటిస్తున్నాడు అయితే చిరంజీవి తో పాటు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఈ మధ్య రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి.
మొదటగా ఈ క్యారెక్టర్ నీ మహేష్ బాబు చేత చేయించాలి అనుకున్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో మహేష్ బాబు ప్లేస్ లోకి రాంచరణ్ వచ్చాడు.ఈ మూవీ కోసం చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు.
ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ గా వెలుగొందడం అనేది సాధారణమైన విషయం కాదు.అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఉన్న యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము.