జైలు నుండి బయటకొచ్చాడు చచ్చిపోయినట్లు నమ్మించి పరారైయ్యాడు!

అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి శిక్ష తప్పించుకోవడానికి పన్నాగం వేసి పోలీసులకు చిక్కాడు.ఒక వ్యక్తిని చంపి తాను చనిపోయినట్లు నటించిన అతన్ని చివరకు పోలీసులు పట్టుకున్నారు.

 Meerut Man Accused Out On Bail Kills Another Man Fake Own Death-TeluguStop.com

పోలీసులు అతనితో పాటు తన భార్య, బంధువును కూడా కటకటాలలో వేశారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 Meerut Man Accused Out On Bail Kills Another Man Fake Own Death-జైలు నుండి బయటకొచ్చాడు చచ్చిపోయినట్లు నమ్మించి పరారైయ్యాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరట్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి బెయిల్ పై బయటకు వచ్చాడు.

శిక్ష నుండి తప్పించుకోవడానికి మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తికి తన బట్టలు, కొంత డబ్బు ఇచ్చాడు.డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ బట్టలు వేసుకోవడానికి అంగీకరించాడు.

భార్య మరియు బంధువు సహాయంతో ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో హత్య చేశాడు.చనిపోయిన వ్యక్తి రాజ్ కుమార్ అని పోలీసులు అనుకోవాలని అతని ముఖాన్ని ఛిద్రం చేసి, అతని ఆధార్ కార్డ్ ను ఆ మృతదేహం దగ్గర పడేశారు.సెప్టెంబర్23న పోలీసులకు ఈ మృతదేహం దొరికింది.రాజ్ కుమార్ ఆధార్ కార్డ్ దొరకడం, మొహం ఛిద్రమవ్వడం పోలీసులకు అనుమానం కలిగేలా చేసాయి.

దీనితో రాజ్ కుమార్ ఈ హత్య చేసి ఉండవచ్చనే ప్రాధమిక అనుమానంతో పోలీసులు తన భార్య ని దర్యాప్తు చేయగా అసలు నిజం తెలిసింది.అతనికి సహకరించినందుకు భార్య, సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

#Fake Death #MeerutMan #Meerut #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు