టాలీవుడ్ లో ఢీ, ఈడోరకం ఆడోరకం, ఓటర్, దేనికైనా రెడీ, తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి డైలాగ్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు గురించి టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.గత కొద్దికాలంగా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకి అందుబాటులో ఉంటున్నాడు.
అయితే తాజాగా శివరాత్రి పండుగ సందర్భంగా మరో మాజీ భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు మంచు మోహన్ బాబు.
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 60 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి భక్తకన్నప్ప అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.ఈ చిత్రంలో మంచు విష్ణు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కూడా మోహన్ బాబు అధికారికంగా తెలియజేశారు.
అంతేగాక ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి కూడా తొందరలోనే వివరాలు తెలియజేస్తామని కూడా తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ ఈ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి.నటన పరంగా మంచు విష్ణు బాగానే మెరుగులు దిద్దుకునప్పటికీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు సరైన అవకాశం ఇప్పటివరకు రాలేదు.అయితే ఈ భక్తకన్నప్ప చిత్రంతో తన టాలెంట్ ని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.