గత కొన్ని రోజులుగా యంగ్ హీరో నాగశౌర్య మరియు దర్శకుడు వెంకీ కుడుముల మద్య గొడవ నడుస్తున్న విషయం తెల్సిందే.అశ్వథ్థామ చిత్రం ప్రమోషన్ సందర్బంగా నాగశౌర్య మాట్లాడుతూ వెంకీ కుడుములపై సంచలన ఆరోపణలు చేశాడు.
తాను లైఫ్ ఇచ్చినా అనే విశ్వాసం కూడా లేకుండా నా ఫోన్ ఎత్తడం మానేశాడు.నేను గిఫ్ట్‌గా ఇచ్చిన కారును కూడా వాడకుండా అమ్మేశాడు అంటూ ఆరోపించాడు.
ఇంతకు వీరిద్దరి మద్య వచ్చిన తేడా ఏంటీ, ఇద్దరికి మద్య గొడవ ఎక్కడ వచ్చింది అనేది ప్రస్తుతం అందరిని వేదిస్తున్న ప్రశ్న.
ఇదే సమయంలో వెంకీ కుడుముల భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఛలో చిత్రం కంటే భీష్మ చిత్రం మంచి సక్సెస్‌ను దక్కించుకుని భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.ఈ నేపథ్యంలో నాగశౌర్య కుళ్లుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
తనతో వివాదం ఉన్న దర్శకుడికి ఇంతటి హిట్ పడటంతో ఆ హీరో కాస్త కడుపులో మంట పెట్టుకుంటున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆయనకు ఎలా ఉందో కాని నాగశౌర్య అభిమానులకు మాత్రం వెంకీ కుడుముల సక్సెస్ కొట్టడం నచ్చలేదు.
మరో వైపు భీష్మ విజయంతో నితిన్ చాలా హ్యాపీగా ఉన్నాడు.ఆయన తన సంతోషంను వెంకీ కుడుములతో షేర్ చేసుకుంటున్నాడు.కారును బహుమానంగా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడట.నాగశౌర్య ఇచ్చిన కారును అమ్మేయకుండా, అలా అని బయటకు తీయకుండా అలాగే ఉంచుతున్నాడు.ఇప్పుడు నితిన్ ఇచ్చిన కారులో చక్కర్లు కొడతాడేమో చూడాలి.