భారత సంతతికి చెందిన మహిళా నేత, బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్‌ను( British-Indian ex-minister Priti Patel ) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిని తూర్పు లండన్‌కు చెందిన 65 ఏళ్ల హెల్త్ కేర్ సెక్టార్ వర్కర్ అయిన పూనీరాజ్ కనకియాగా( Pooneeraj Canakiah ) గుర్తించారు.
ఇతను ప్రీతి పటేల్‌ను బెదిరిస్తూ లేఖను పంపాడు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అరెస్ట్ చేసి గతవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు( Westminster Magistrates Court ) ఎదుట హాజరుపరచగా.
ఐదు నెలల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి.
ప్రీతి పటేల్ హోంమంత్రిగా వున్నప్పుడే ఆమె సిబ్బంది గతేడాది జనవరి 22న సదరు లేఖను తెరిచారు.ప్రీతి ఆ లేఖను వ్యక్తిగతంగా చూడలేదు.అయితే అది ఎవరు రాశారో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ పరీక్షను ఉపయోగించారు.
లేఖలోని కంటెంట్ చాలా అభ్యంతరకరంగా వుందని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సీనియర్ ప్రాసిక్యూటర్ లారెన్ దోషి అన్నారు.ఈ కేసులో తాను పట్టుబడనని నిందితుడు అనుకున్నాడని.కానీ ఫోరెన్సిక్ విశ్లేషణలో అతను లేఖ రాసినట్లు తేలిందని దోషి తెలిపారు.ఇలాంటి బెదిరింపులను చాలా తీవ్రంగా పరిగణిస్తామని.
ఈ తరహా నేరాలను విచారించడానికి సీపీఎస్ వెనుకాడదని లారెన్ అన్నారు.
అయితే ప్రతీ పటేల్‌కు పంపిన కాగితంపై కనకియా .డ్రైవర్ అండ్ వెహికల్ లైసెన్సింగ్ ఏజెన్సీ (డీవీఎల్ఏ)కి రాసినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.పేపర్‌లోని ఇండెంటేషన్‌ల విశ్లేషణ ద్వారా కనకియా పేరు, అడ్రస్‌లను కనుగొన్నారు .కవర్, లేఖపై వున్న చేతివ్రాతలను పోల్చి చూసిన తర్వాత లెటర్ పంపింది కనకియా అని పోలీసులు నిర్ధారించారు.పోలీసులు నిందితుడిని విచారించగా.
అతను ఈ అభియోగాలను ఖండించాడు.అయితే గతేడాది మార్చిలో అసభ్యకరమైన సందేశాన్ని పంపిన నేరాన్ని మాత్రం అంగీకరించాడు.
ప్రస్తుతం ఈ వ్యవహారం బ్రిటన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.