ప్రత్యేక రాష్ట్ర కోరికను తీర్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లో కింది స్థాయి లో బలం ఇంకా కలిగి ఉంది కానీ రాష్ట్ర స్థాయి నాయకుల విషయంలో మాత్రం ఐఖ్యత కొరవడింది అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.జాతీయ స్థాయి లో పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వందల కిలో మీటర్లు పాద యాత్ర నిర్వహించారు.
కానీ రాష్ట్రం లో మాత్రం పార్టీ పరిస్థితి మారడం లేదు.దేశం లో ఎక్కడ లేని పరిస్థితి తెలంగాణ లో ఉంది అనడంలో సందేహం లేదు.
రాష్ట్రం లో కష్టపడితే మినిమం సీట్లు అయినా దక్కించుకునే అవకాశం ఉంది.
కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎన్ని గెలుస్తారు అనే విషయం లో క్లారిటీ లేదు.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకునే మీడియా ప్రతినిధులు ఇటీవల జరిపిన ఒక కింది స్థాయి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి( Telangana congress ) తెలంగాణ లో మంచి బలం ఉందని అంటున్నారు.కానీ నాయకులు సరిగా లేకపోవడంతో పాటు ముఖ్య మంత్రి సీటు కోసం కొట్టాడుకోవడంతో పాటు ప్రతి విషయం లో కూడా పార్టీ నాయకత్వం ను దిక్కరిస్తూ ఉండటం వల్ల తమకు నమ్మకం తగ్గుతుందని వారు అన్నారట.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయినా కూడా ఆయన్ను ముఖ్య నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.పార్టీ యొక్క బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదు.పార్టీకి చెందిన సీనియర్ నాయకుల్లో దాదాపు పది నుండి పదిహేను మంది పోటీ విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
వారిలో ఎక్కువ శాతం గెలిచే సత్తా ఉన్న వారే.అలాంటి వారు పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ఒక వేళ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై కోపం తో వారు పోటీ నుండి తప్పుకుంటే మాత్రం కచ్చతంగా జాతీయ నాయకత్వం విధించే శిక్ష కు బాధ్యులు అవ్వాల్సి ఉంటుంది.