పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు.ప్రత్యర్థులకు సింహస్వప్నంలా ఉండే మమత ఇంట్లో మాత్రం చాలా శాంతంగా ఉంటారని చెబుతారు.
మమతా బెనర్జీనే దీదీ అని పిలుస్తారు.మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే అనే విషయం అందరికీ తెలిసిందే.
మొన్న ఈ మధ్యే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కోలుకోలేని దెబ్బతీసి దీదీ వరుసగా రెండో సారి బెంగాల్ పీఠాన్ని అధిరోహించింది.బెంగాల్ సీఎం అయిన తర్వాత దీదీ తనదైన పద్ధతిలో పాలన సాగించుకుంటూ వెళ్తున్నారు.
తాజాగా దీదీ కామెంట్స్ మరో సారి హాట్ టాపిక్ అయ్యాయి.అయితే ఈ సారి దీదీ కామెంట్లు చేసింది తన ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద కాకపోవడం విశేషం.
తన సోదరుడి గురించి దీదీ కామెంట్లు చేసింది.ఇంతకీ ఏం జరిగిందంటే…
దీదీ సోదరుడి భార్యకు ఇటీవలే కరోనా పాజిటివ్ గా తేలింది.
దీంతో మమతా బెనర్జీ స్వీయ నిర్భందంలోకి వెళ్లింది.కానీ ఆమె సోదరుడు మాత్రం బయట నిబంధనల్ని ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా తిరుగుతున్నాడు.
ఇంట్లో ఒకరు కరోనాతో పోరాడుతుంటే ఐసోలేషన్ లో ఉండాలనే నియమం మర్చిన అతడు బయట తిరుగుతుండడంతో… దీదీకి కోపం నశాలానికి చేరింది.దీంతో తన సోదరుడిని చెడా మడా తిట్టేసింది.
దీనిపై దీదీ మాట్లాడుతూ.ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించింది.రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించింది.అలసత్వం వహించకూడదని తెలిపింది.మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది.త్వరలో జరగబోయే ఎన్నికలకు దీదీయే థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తుందని చాలా మంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.
మరి థర్డ్ ఫ్రంట్ బాధ్యతను దీదీ తీసుకుంటుందా? లేదా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.