తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్స్ కి కొదవేలేదు.పుట్టలుగా కొత్తవారిని కూడా రంగంలోకి దించుతున్నారు మన మేకర్స్.
కానీ ప్రతిసారి టాలీవుడ్ కి ఏదైనా షార్టేజ్ ఉందా అంట అది కేవలం విలన్ల కొరతే.ఆ కొరతను అధిగమించడానికి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ దర్శకులు కొత్త తరహా మార్గాన్ని ఎంచుకున్నారు.
అదేంటంటే మల్లు వుడ్ నుంచి అనేక మంది హీరోలను విలన్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.మరి మలయాళ హీరోలను పరిచయం చేస్తున్న ఆ సినిమాలు ఏంటి ?ఆ హీరోలు ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫాహద్ ఫాజిల్
పుష్ప సినిమా తో( Pushpa ) విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఫహద్ ఫాజిల్.( Fahadh Faasil ) ఈ సినిమా సీక్వెల్లో కూడా విలన్ గానే మెరిపించబోతున్నాడు.
ఇతడిని ఆదర్శంగా తీసుకొని మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి విలన్స్ గా వస్తున్నారు.
జోజు జార్జ్
రీసెంట్ గా విడుదలైన వైష్ణవి తేజ్ సినిమా ఆదికేశవ లో మరొక మలయాళ హీరో విలన్ గా నటించాడు.అతని పేరు జోజు జార్జ్.( Joju George ) మలయాళంలో ఓవైపు హీరోగా నటిస్తూనే తెలుగులో విలన్ గా ఫిక్స్ అయ్యే విధంగా జోజు సినిమాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు.
సుదేవ్ నాయర్
టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సపోర్టింగ్ పాత్రలో మొదటి సుదేవ్ నాయర్( Sudev Nair ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత నితిన్ ఎక్స్ట్రార్డినరీ సినిమా కోసం మెయిన్ విలన్ గా మారాడు ఈ మలయాళ నటుడు.
షైన్ టామ్ చాకో
నానికి మంచి హిట్ ఇచ్చిన మూవీ దసరా. ఈ సినిమాలో నాని నటనకు దీటుగా ఉండడానికి మలయాళ నుంచి షైన్ టామ్ చాకో( Shine Tom Chacko ) అనే నటుడిని విలన్ గా దించారు.ఈ సినిమాలో చాకో నటన అద్భుతంగా ఉంది.మరికొన్ని సినిమాలకు సైన్ చేసే పనిలో ఉన్నాడు చాకో.
పృథ్వీరాజ్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ సలార్. ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా నటించడానికి వచ్చాడు మరొక మలయాల నటుడు పృథ్వీరాజ్( Prithviraj ) ఇప్పటివరకు మలయాళం లో హీరోగా కొనసాగిన ఈ నటుడు మొదటిసారిగా ప్రభాస్ కోసం విలన్ అవతారం ఎత్తాడు.