క్యూ నెట్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉపేంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
నిందితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.హైదరాబాద్ కేంద్రంగా మోసాలకు పాల్పడిన నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని కాల్ సెంటర్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో క్యూనెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.కొన్నేళ్ల కిందట సంస్థను మూసివేసినా మరో పేరుతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదే కేసులో గతంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.