జక్కన్నకు సాధ్యం కానిది మహేష్ బాబుకు సాధ్యమైందా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తన సినిమాలకు పబ్లిసిటీ చేసే విషయంలో అందుబాటులో ఉన్న ఏ మంచి అవకాశాన్ని వదులుకోరనే సంగతి తెలిసిందే.తక్కువ ఖర్చుతో సినిమాకు ఏ విధంగా పబ్లిసిటీ చేయాలో రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య అని నెటిజన్లు సైతం అభిప్రాయపడతారు.రాజమౌళి ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకున్నా సినిమా ఫలితం ద్వారా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని సొంతం చేసుకుంటారు.

 Mahesh Babu Achieves Rare Feet In Twitter Emoji Details, Mahesh Babu, Rajamouli,-TeluguStop.com

బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద జక్కన్న క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు బ్రేక్ కావాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ కనీవిని ఎరుగని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.రాజమౌళి మహేష్ కాంబో మూవీతో ఈ రికార్డులు మళ్లీ బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.2023 సంవత్సరంలో ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే జక్కన్నకు సాధ్యం కానిది మహేష్ చేశారంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

Telugu Svpmania, Rare Feet, Rajamouli, Keerthy Suresh, Mahesh Babu, Parashuram,

మరో ఐదు రోజుల్లో మహేష్ నటించిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కానుంది.ట్విట్టర్ లో సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ కు మహేష్ బాబు ఎమోజీ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొత్తం మూడు హ్యాష్ ట్యాగ్స్ లో ఈ స్పెషల్ ఎమోజీ వైరల్ అవుతోంది.

Telugu Svpmania, Rare Feet, Rajamouli, Keerthy Suresh, Mahesh Babu, Parashuram,

#SarkaruVaariPaata, #SVP, #SVPMania అనే హ్యాష్ ట్యాగ్ లకు ఈ స్పెషల్ ఎమోజీని జోడించారు.మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ కొరకు ట్విట్టర్ ఎమోజీ కోసం ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube