కళాతపస్వి కె.విశ్వనాథ్( K Viswanath ) తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు.వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘చెల్లెలి కాపురం’.గొల్లపూడి మారుతీ రావు, మన్నవ బాలయ్య ఇద్దరూ కలిసి రాసిన కథతో ఈ సినిమాను రూపొందించారు విశ్వనాథ్.ఇందులో శోభన్ బాబు నల్లగా ఉన్న వ్యక్తి లాగా మేకప్ వేసుకొని నటించాడు.అతనొక పోయెట్ లేదా కవి కాగా అతని నల్లని కలర్ వల్ల ఎవరూ కూడా పోయెట్రీ పబ్లిష్ చేయడానికి ఒప్పుకోరు.
ఇక ఇందులో కథానాయికగా నటించిన వాణిశ్రీ ధనవంతురాలిగా కనిపించింది.ఆమె శోభన్ బాబు పద్యాలను బాగా అభినందిస్తుంది.
నిర్మాత ఎం.బాలయ్య ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ 1971లో ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చి చాలామంది దృష్టిని ఆకర్షించింది.ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఈ మూవీకి దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ కె.వి.మహదేవన్ సంగీత బాణీలు సమకూర్చారు.ఈ సినిమా ఆయువుపట్టు కె.వి.మహదేవన్ మ్యూజిక్‌కేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
ఈ మూవీలో ‘కనుల ముందు నీవుంటే.కవిత పొంగి పారదా.’, ‘ఈ దారి నా స్వామి నడిచేనే… రానే వచ్చాడు’, ‘ఆడవే మయూరి.
నటనమాడవే మయూరీ.’ సాంగ్స్ సూపర్ పాపులర్ అయ్యాయి.
ఎందుకంటే ఇవి ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినేంత గొప్పగా ఉంటాయి.ముఖ్యంగా ‘ఆడవే మయూరి.
’ పాట చాలా కొత్తగా, పాడటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.ఈ క్లిష్టమైన పాటను దివంగత ప్లే బ్యాక్ సింగర్ ఎస్.
పి.బాలసుబ్రహ్మణ్యం( S P Balasubramaniam ) పాడారు.ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.ఈ పాట వెనుక చాలానే కథ నడిచింది.దీనికి లిరిక్స్‌ను డా.సి.నారాయణరెడ్డి రాశారు.ఆపై పాటకు ట్యూన్ కట్టాలంటూ లిరిక్స్‌ను మహదేవన్ వద్దకు పట్టుకెళ్లారు.
అయితే ఈ పాట చివరి చరణంలో కొంతవరకు సంస్కృత పదాలు ఉన్నాయి.ఆ పదాలు పలకడమే కష్టం అనుకుంటే అవి ఎవరికీ అర్థం కాని విధంగా ఉన్నాయి.
ఈ సినిమా చూసిన వారికి ఆ లిరికల్ లైన్స్ ఏంటో గుర్తుండే ఉంటుంది.మరోసారి చూస్తే అవి ‘ప్రళయ కాల సంకలిత భయంకర.
జలధరార్బుటుల చలిత దిక్కుటుల.జటిత దిక్కురుల వికృత ఫీుంకృతుల .సహస్రఫణ సంచలిత భూకృతుల.’ ఈ విధంగా ఉంటుంది.
ఆ పదాలను డాక్టర్ సి.నారాయణరెడ్డిగా( C Narayana Reddy )రు వినిపించగా మహదేవన్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేశాడు.ఈ సంస్కృత పదాలు చాలా జఠిలంగా ఉన్నాయి, వీటితో పాటకు ట్యూన్ చేయడం కష్టం అని చేతులెత్తేసారట.అయితే “పాట ఏ సందర్భంలో వస్తుందో మీకు తెలియడం లేదు, ఒక కవికి, డాన్సర్‌కి మధ్య జరిగే పోటీ అది.కవి కోసం ఇలాంటి పదాలు వాడితేనే కిక్ వస్తుంది.” అని నారాయణరెడ్డి వివరించారట.మహదేవన్ ఆయన చెప్పిన మాటలకు కన్విన్స్ అయి పాటను ట్యూన్ చేశారు.చివరికి అదే పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యి కూర్చుంది.