రాష్ట్రంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.వైసీపీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తున్నదని ధ్వజమెత్తారు.
సోమవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు తాజా పరిణామాలపై చర్చించారు.ప్రజా సమస్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా ఆమోదించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదల పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను అభినందించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన తెలిపిన టీడీపీ నేతలఫై అక్రమ అరెస్టు కేసులు నమోదు చేయడాన్ని సమావేశంలో ఖండించినట్లు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లిస్తారని అన్నారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతుందని ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై కార్యకర్తలపై హత్యలు, దాడులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.ఇలాంటి పరిస్థితి గతంలో రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా సమావేశం డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో పార్టీ నాయకులు నిమ్మల రామానాయుడు.వర్ల రామయ్య.శ్రీనివాసులు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి.దేవినేని ఉమామహేశ్వర రావు.
బోండా ఉమామహేశ్వర రావు.పి అశోక్ బాబు.
తదితరులు పాల్గొన్నారు