తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది యూట్యూబ్ యాంకర్లుగా ఫేమస్ అయ్యారు.
ఇక ఇలా ఫేమస్ అయినటువంటి వారిలో స్రవంతి చొక్కారపు ( Sravanthi Chokkarapu ) ఒకరు.ఈమె కూడా యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ గా కూడా పాల్గొనారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా ఈమె సోషల్ మీడియాలో( Social media ) చేసే రీల్స్ మాత్రం కుర్రకారులకు కళ్ళు పక్కకు తిప్పుకొని ఇవ్వకుండా చేస్తుంటారు.భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఈమె అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా ఈమెకు పెళ్లి జరిగి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలా గ్లామర్ షో చేయడంతో ఈమె పట్ల భారీ స్థాయిలోనే ట్రోల్స్ వస్తూ ఉంటాయి.
ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ షేర్ చేశారు.ఇందులో భాగంగా ఏకంగా తలపై మందు గ్లాసుతో ఈమె డాన్సులు చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నెత్తిపై మందు గ్లాసు పెట్టుకొని ఈమె చేసినటువంటి ఈ డాన్స్ వీడియో ను షేర్ చేస్తూ.
యానిమల్ సినిమా చూసిన తర్వాత రోజంతా నా పరిస్థితి ఇది అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు( Negative comments ) చేస్తూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.కోటి కోసం కోటి విద్యలు అంటూ కొందరు కామెంట్లు చేయగా…
మరి కొందరు మాత్రం ఇలా మందు తాగుతూ పబ్ లో చేయాల్సినటువంటి డాన్సులు పబ్లిక్ లో చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు మాత్రం ఇలా పెళ్లి జరిగే పిల్లలు ఉన్నా కూడా ఏంటి ఈ పిచ్చి పనులు అంటూ ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి కొంత మంది మాత్రం కేవలం మీరు పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కట్టుకున్న మొగుడు పెళ్ళాలను కూడా వదిలి ఈ వేషాలు ఏంటి అంటూ ఈమె పట్ల నెట్టిజెన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈమె గురించి ఈ విధంగా ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ కూడా ఈమె మాత్రం తన వ్యవహార శైలిని మార్చుకోలేదని చెప్పాలి.
ప్రస్తుతం స్రవంతి షేర్ చేసినటువంటి ఈ రీల్ వీడియో వైరల్( video viral ) అవుతుంది.