Hero Nani HIT 3: హీరో నానిని చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి.. షాక్ లో నెటిజెన్స్?

శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం హిట్ 2.ఈ సినిమాకు హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

 Lady Fan Strong Warning To Nani Video Shared By Adivi Sesh Later Deleted , Nani,-TeluguStop.com

తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం చిత్ర బంధం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా హిట్ 1, హిట్ 2 సినిమాలకు హీరో నానినే నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా విడుదల అయిన హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో హిట్ 3 సినిమా కూడా ఉండబోతుందని అందులో నాని హీరోగా నటించిన బోతున్నాడు అంటూ హింట్ ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించిన సన్నివేశాలు హీరో ఇంట్రడక్షన్ అన్ని విషయాలను చూపించిన విషయం తెలిసిందే.

హిట్ 3 లో హీరో నాని అర్జున్ సర్కార్ అనే ఒక బ్రుటల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు.అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న దాని పై ఒక లేడీ అభిమాని రియాక్ట్ అయింది.

హిట్ 3 సినిమాలో కచ్చితంగా సైకో కిల్లర్ గా లేడీ విలనె ఉండాలి.లేకుంటే నేను ఒప్పుకోను నాని గారు.మీరు లేడీ సైకో కిల్లర్ ను పెట్ట లేదంటే ఆ మహేష్ ను నేనే చంపేసి లేడీస్ సైకో కిల్లర్ ను అయిపోతాను అంటూ నానికి నవ్వుతూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది లేడీ అభిమాని.అందుకు సంబంధించిన వీడియోని హీరో అడివి షేర్ చేస్తూ చంపిన చంపేస్తుంది కానీ థియేటర్లో అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియో పట్ల నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.ఇంకొందరు నెటిజన్స్ అసలు ఆ మహేష్ ఎవరూ అతన్ని ఆమె ఎందుకు చంపాలనుకుంటుంది అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.అయితే హిట్ 3 సినిమాలో నాని హీరోగా రాబోతున్నారు అన్న వార్తలపై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఒక వర్గం ప్రేక్షకులు సినిమాలో నాని ఎలా ఉండబోతున్నాడో చూడాలని ఉంది అని కామెంట్ చేయగా ఇంకొక వర్గం ప్రేక్షకులు అలాంటి సినిమాలు నానికి సెట్ కావు అంటూ నాని పై ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube