నిన్న మొన్నటి వరకూ ఎన్నారై లకి అడ్డుకట్ట వేయాలని భావిస్తూ అందుకు తగ్గట్టుగానే వీసాల జారీ విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతూ భారతీయ వలసదారులే టార్గెట్ గా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే.అయితే ఇప్పుడు అదే బాటలో కువైట్ ప్రభుత్వం సైతం అడుగులు వేయడం ఎంతో మంది వలస దారులకి ఆందోళన కలిగిస్తోంది.
వివరాలలోకి వెళ్తే.
Insert Img
అన్ని దేశాలలో కంటే కంటే భారత్ నుంచీ ఇతర దేశాలకి వలసలు వెళ్ళే వారిలో భారతీయులే అధికంగా ఉంటారు.అయితే గల్ఫ్ వంటి దేశాలలో ఎక్కువగా భవన నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి.దాంతో అవసరమైన లేబర్‌ను భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు రప్పిస్తుంటారు.
దాంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగవకాశాలు ఉండేవి.అయితే ఇప్పుడు రాను రాను పరిస్థితులు తల్లకిందులు అవుతున్నాయి.
కువైట్ ప్రభుత్వం ఈ వలసల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్డం చేసింది.
కువైట్ కి వచ్చే వలసదారుల సంఖ్యను సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.గడిచిన ఐదేళ్ళలో వలసదారుల సంఖ్య 4.8శాతం పెరిగితే.ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య ఏకంగా 2 శాతానికి చేరింది…అయితే ఈ శాతాన్ని రానున్న రోజుల్లో కేవలం 1.5 శాతానికి పరిమితం చేయాలని కువైట్ భావిస్తోందని తెలుస్తోంది.అంతేకాదు ప్రభుత్వ రంగంలోకి కేవలం కువైట్ పౌరులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది…అయితే
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో వలసదారులకు అవకాశాలు సన్నగిల్లాయి.అలాగే వివిధ పన్నుల పేరుతో వలసదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఎంతో మంది వలసదారులు స్వదేశాల బాట పడుతున్నారు…పైగా రియల్ ఎస్టేట్ రంగం కూడా కువైట్ లో పడకేయడంతో అవకాశాలు మరింతగా తగ్గుముఖం పట్టనున్నాయని రియల్ ఎస్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ అహ్మద్ అల్ ద్వివహ్ తెలిపారు…అయితే ఈ పరిస్థితికి కారణం వలసదారులని స్వదేశాలకి పంపడం కోసమా లేక మరేదన్నా కారణమా అనేది మాత్రం తెలియడం లేదు అంటున్నారు విశ్లేషకులు.