కువైత్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా యువతులు బట్టలు విప్పి ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం కలకలం రేపుతుంది.స్పెయిన్ లో గత సంవత్సరం నవంబర్ లో ఇంటర్వ్యూల సందర్భంగా ఈ దారుణం జరిగిందని ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతి వెల్లడించింది.
ఉద్యోగానికి వచ్చిన యువతుల ఒంటి పై టాటూలు ఇతర మచ్చలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు బట్టలు విప్పించారని దరఖాస్తు చేసుకున్నా యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఒంటి పై లో దుస్తులతో మాత్రమే తము నిలబడాల్సి వచ్చిందని బాధిత యువతి బాధపడింది.
తమను ఇంటర్వ్యూ చేసిన వారు పలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పింది.నవ్వు బాగాలేదని, శరీరాకృతి సరిగ్గా లేదని హీనమైన కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించింది.
కువైట్ ఎయిర్ వేస్ తరఫున ఒక రిక్రూమెంట్ ఏజెన్సీ ఈ ఇంటర్వ్యూ ను నిర్వహించింది.దీని వల్ల కువైట్ ఎయిర్వేస్ పై నెటిజెన్లు భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ఈ ఆరోపణల పై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని తాజాగా కువైట్ ఎయిర్ వేస్ స్పందించింది.గత ఐదు సంవత్సరాల నుంచి ఆ సంస్థ మా తరఫున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతుందని తెలిపింది.స్పెయిన్ లోని ఇతర విమానయాన సంస్థలు ఇదే ఏజెన్సీ సేవలు వినియోగించుకుంటున్నాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది.ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదని విభ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ సంస్థ ఈ చర్యలను అస్సలు సహించమని కూడా స్పష్టం చేసింది.దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కార్మిక శాఖ కూడా ఈ ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం.